Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వాళ్లు పద్ధతి మార్చుకోవాల్సిందే: రహానె

R Ashwin, Ravindra Jadeja have the skills to perform overseas: Ajinkya Rahane

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా కసరత్తులు మొదలుపెట్టింది. కెప్టెన్‌ కోహ్లీతో పాటు భారత టెస్టు వైస్ కెప్టెన్ రహానె సైతం తన టీంలోని ఆటగాళ్లపై శ్రద్ధ పెట్టాడు. ప్రతి ఒక్కరినీ పరిశీలించి వారి లోపాలను అధిగమించుకోవాల్సిందిగా సూచిస్తున్నాడు.

2017 భారత్‌లో జరిగిన మ్యాచ్‌లలో తమ అద్భుతమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను చిత్తుచేసిన వారిలో అశ్విన్, జడేజాలు ఉన్నారు. అయితే దక్షిణాఫ్రికా గడ్డలోని మైదానాలు విభిన్నంగా ఉంటాయని భారత స్పిన్‌ మాంత్రికులు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా తమ శైలిని మార్చుకోవాలని సూచించాడు.

ఇలా చేస్తే అద్భుత ఫలితాలు రాబడతారని భారత టెస్టు క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ రహానె తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ప్రస్తుతం కోహ్లీ సేన దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు జనవరి 5న కేప్‌టౌన్‌లో ప్రారంభంకానుంది.

ఈ నేపథ్యంలో రహానె మాట్లాడుతూ.. భారత స్పిన్‌ దిగ్గజాలు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా తమ బౌలింగ్‌ శైలితో సొంతగడ్డపై విశేషంగా రాణించారన్నాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో పర్యటనలో ఉన్నాం, కాబట్టి ఇక్కడ పిచ్‌లను దృష్టిలో పెట్టుకుని తమ శైలిని మార్చుకోవాలని సూచించాడు.

ఇంతకుముందు మొయిన్‌ అలీ(ఇంగ్లాండ్‌), నాథన్‌ లయాన్‌(ఆసీస్‌)లు విదేశీ గడ్డలపై ఆడే సమయంలో తమ బౌలింగ్‌ శైలిని మార్చుకున్నారు. అలా వారు విజయాన్ని పొందగలిగారు. ఇదే పంథాలో మన బౌలర్లు అశ్విన్‌, జడేజా కూడా వారి పద్ధతిని మార్చుకోవాలి' అని పేర్కొన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 29, 2017, 14:35 [IST]
Other articles published on Dec 29, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+