For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కౌంటీల్లో ఆడేందుకు సిద్ధమైన మరో టీమిండియా క్రికెటర్

R Ashwin might play two county cricket games for Worcestershire: Report

హైదరాబాద్: టీమిండియా నుంచి మరో క్రికెటర్ కౌంటీల్లో ఆడేందుకు సిద్ధమైయ్యాడు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడే యోచనలో పడ్డాడు. ఇందులో భాగంగానే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నుంచి ఆనుమతి లభించిన తరువాత వర్సెస్టర్‌షైర్‌తో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. భారత్ తరఫున కౌంటీల్లో అడుగుపెట్టే ఆరో క్రికెటర్ అశ్విన్ కావడం విశేషం.

ఈ సీజన్లో వర్సెస్టర్‌షైర్ ఆడే ఆఖరి రెండు మ్యాచ్‌ల్లో.. ఎసెక్స్, యార్క్‌షైర్‌లతో అతడు బరిలో దిగనున్నాడు. గతంలో అశ్విన్ 2017లో కూడా ఈ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ సీజన్లో నాలుగు మ్యాచ్‌లాడిన అశ్విన్ 29.15 సగటుతో 29 వికెట్లు పడగొట్టాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 42.80 సగటుతో 214 పరుగులు కూడా చేశాడు.

ఇప్పటికే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చే జూన్‌లో సర్రే జట్టు తరఫున ఆడేందుకు ఒప్పందం కూడా చేసుకున్న విషయం తెలిసిందే. భారత క్రికెటర్లు ఇషాంత్ శర్శ, వరుణ్ అరోన్, ఛతేశ్వర్ పుజారా ఇప్పటికే కౌంటీ క్రికెట్‌కు ఆడుతున్నారు. యువ క్రికెటర్ అక్షర్ పటేల్ దుర్హం జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

'కోహ్లీ కాళ్లపైనే దృష్టి పెట్టు. అదే కీలకం. అతన్ని ఔట్‌ చేయాలంటే ఓర్పు అవసరం' అని పుజారా యార్క్‌షైర్‌ బౌలర్లకు చెప్పినట్లుగా ఓ ఇంగ్లీష్‌ పత్రిక పేర్కొంది. కోహ్లీ వికెట్‌ తీయాలని ఇప్పట్నుంచే కౌంటీల్లో భారీ ప్రణాళికలు మొదలైయ్యాయన్నమాట. ఈ నేపథ్యంలోనే పూజారా ఎత్తులు వేయడం మొదలెట్టేశాడట.

Story first published: Sunday, May 13, 2018, 16:54 [IST]
Other articles published on May 13, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+