బ్రాడ్‌మన్ ఆఫ్ బౌలింగ్: అశ్విన్‌కు అనుకోని అతిథి ప్రశంస
హైదరాబాద్: టీమిండియా టాప్ స్పిన్నర్, టెస్టు ర్యాంకుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్‌పై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం స్టీవ్ వా ప్రశంసలు కురిపించాడు. 'బౌలింగ్ ఆఫ్ బ్రాడ్‌మన్' అంటూ అశ్విన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఫిబ్రవరి 23 నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రతిష్ఠాత్మక లారెస్ క్రీడా అవార్డుల సందర్భంగా స్టీవ్‌వా మంగళవారం మీడియాతో పలు అంశాలపై మాట్లాడాడు.

'బౌలింగ్ బ్రాడ్‌మన్ అశ్విన్. ప్రస్తుతం అతని ఆటతీరు అద్భుతం. ఆస్ట్రేలియా జట్టు ఎదుర్కోవాల్సిన ప్లేయర్ అతడే. ప్రత్యర్థితో సంబంధం లేకుండా నిలకడగా రాణిస్తూ రికార్డులను బద్దలు కొడుతున్న తీరు అద్వితీయం. అతని గణాంకాలు అద్భుతం' అని స్టీవ్ వా కొనియాడాడు.
'అశ్విన్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొవాలనే దానిపై ఆసీస్ దృష్టిసారించాలి. ఒకవేళ దానిని అధిగమించగల్గితే ఆసీస్ గెలిచే అవకాశముంటుంది. కోహ్లీ కెప్టెన్సీ జట్టుకు అదనపు బలం. సహచరుల్లో స్ఫూర్తినింపుతూ ముందుండి నడిపించే అతని నైజంతో టీమిండియా ఏ జట్టునైనా ఓడించగలుగుతుంది' అని అన్నాడు.
మరోవైపు కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సొంతగడ్డపై వరుసగా సిరీస్‌లు ఆడుతూ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అలాంటి టీమిండియాను ఓడించడం కష్టమే అని స్టీవ్‌వా అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications