8 వికెట్ల దూరంలో: ఈడెన్ గార్డెన్స్‌లో అశ్విన్ చరిత్ర సృష్టిస్తాడా?
హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు గురువారం కోల్‌కతా వేదికగా ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరిస్‌తో జట్టులో తిరిగి చోటు దక్కించుకున్న టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడు.

కోల్‌కతా టెస్టులో 8 వికెట్లు తీస్తే
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే తొలి టెస్టులో అశ్విన్ 8 వికెట్లు తీయగలిగితే అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటికే 52 మ్యాచుల్లో 292 వికెట్లు తీసిన అశ్విన్... 56 మ్యాచుల్లో ఈ ఘనతను సాధించి అగ్రస్ధానంలో ఉన్న ఆసీస్ మాజీ బౌలర్ డెన్నీస్ లిల్లీ రికార్డుని బద్దలు కొడతాడు.

రెండో స్ధానంలో ముత్తయ్య మురళీధరన్
ప్రస్తుతం ఈ జాబితాలో రెండో స్ధానంలో ఉన్న శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 58 మ్యాచుల్లో ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆ తర్వాతి స్ధానాల్లో హడ్లీ (న్యూజిలాండ్), మార్షల్ ( వెస్టిండీస్), డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికాలు) 61 మ్యాచుల్లో ఈ ఘనతను సాధించారు.

66 టెస్టులో ఈ మైలురాయి అందుకున్న కుంబ్లే
ఇక, భారత్ తరుపున మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 66 టెస్టులో ఈ మైలురాయి అందుకున్నాడు. దీంతో పాటు టెస్టు క్రికెట్‌లో మరో 6 వికెట్లు తీస్తే వరుసగా మూడేళ్లలో 50కి పైగా వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కూడా రవిచంద్రన్ అశ్విన్ గుర్తింపు పొందుతాడు.

ఈడెన్‌లో అశ్విన్ రికార్డు అంతంత మాత్రమే
2016లో 12 మ్యాచ్‌ల్లో 72 వికెట్లు తీసిన అశ్విన్.. 2015లో 9 మ్యాచుల్లో 62 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే తొలి టెస్టు జరిగే ఈడెన్ గార్డెన్స్‌లో అశ్విన్ రికార్డు అంతంత మాత్రంగానే ఉంది. ఈ స్టేడియంలో అశ్విన్ యావరేజ్ 34.05గా ఉంది. ఇక్కడ రెండు టెస్టులు ఆడిన వికెట్లు తీయడంలో పూర్తిగా విఫలమయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications