రాజ్ కోట్ : ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలిటెస్టు తొలి ఇన్నింగ్స్ లో 488పరుగులకు ఆలౌట్ అయింది టీమ్ ఇండియా. ఓవర్ నైట్ స్కోరు 319/4 తో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా.. ఆ తర్వాత కోహ్లి, రహానే వికెట్లను త్వరత్వరగా కోల్పోవడంతో కష్టాల్లో పడింది. 70 పరుగులతో టీమ్ ఇండియాను ఆదుకున్న అశ్విన్ చివరి వికెట్ గా వెనుతిరగడంతో.. 488పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ కు ఫుల్ స్టాప్ పడింది.
దీంతో ఇంగ్లాండ్ నిర్దేశించిన 537 పరుగుల తొలి ఇన్నింగ్స్ లక్ష్యానికి 49పరుగుల దూరంలో ఆగిపోయింది టీమ్ ఇండియా. ఐదు రోజుల ఆటలో మరో రోజు మాత్రమే మిగిలి ఉండడంతో.. మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండు తరుపున జో రూట్(124), మొయిన్ అలీ(117), బెన్ స్టోక్స్ (128) ముగ్గురు శతకాలు బాదగా.. టీమ్ ఇండియా తరుపున చటేశ్వర్ పూజారా (124), మురళీ విజయ్(126) శతకాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

భారత్ తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ విరాట్ కోహ్లి హిట్ వికెట్ గా వెనుదిరగడం గమనార్హం.
భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు వివరాలు :
మురళీ విజయ్(126), గౌతం గంభీర్ (24), చటేశ్వర్ పూజారా (124), విరాట్ కోహ్లి(40), అమిత్ మిశ్రా(0),అజింక్యా రహానే (13), రవిచంద్రన్ అశ్విన్(70), సాహా(35), రవీంద్ర జడేజా(12), ఉమేశ్ యాదవ్(5), మహమ్మద్ షమీ(8)
వికెట్ల పతనం : 68-1 (గౌతం గంభీర్, 24.1), 277-2 (చటేశ్వర్ పూజారా, 91.1), 318-3 (మురళీ విజయ్, 107.6), 319-4 (అమిత్ మిశ్రా, 108.3), 349-5 (,అజింక్యా రహానే 116.5), 361-6 (,విరాట్ కోహ్లి, 119.3), 425-7 (సాహా, 143.6), 449-8 (రవీంద్ర జడేజా, 153.3), 459-9 (ఉమేశ్ యాదవ్, 155.4), 488-10 (రవిచంద్రన్ అశ్విన్, 161.6)