ఫోటోలు: బంగ్లా కెప్టెన్ నుంచి అశ్విన్‌కు అరుదైన కానుక
హైదరాబాద్: బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా టాప్ స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన కానుకను అందుకున్నాడు. ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో అశ్విన్ అత్యంత వేగంగా 250 వికెట్లు తీసుకుని ప్రపంచ రికార్డుని నెలకొల్పిన సంగతి తెలిసిందే.
ఈ టెస్టులో కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్‌ను అవుట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ ఘనతను సాధించాడు. అశ్విన్ వేసిన బంతిని స్వీట్ షాట్ ఆడబోయిన రహీమ్, కీపర్ వృద్ధిమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో గతంలో డెన్నిస్ లిల్లీ పేరిట ఉన్న రికార్డును అశ్విన్ అధిగమించాడు.

ముష్ఫికర్ రహీమ్ సంతకం చేసిన బంతి
భారత్‌లో 208 పరుగుల తేడాతో ఓటమి పాలైన అనంతరం మీడియాతో మాట్లాడిన కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ తాను సంతకం చేసిన బంతిని అశ్విన్‌కు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. 'అవును. మ్యాచ్ బంతితో అశ్విన్ నా వద్దకు వచ్చాడు. నేను అతడి 250వ వికెట్ కావడంతో సంతకం చేశాను. డెన్నిస్ లిల్లీ రికార్డుని అధిగమించాడని విన్నా' అని చెప్పాడు.

ధోని నేర్పిన అలవాటే
ఇలా మ్యాచ్‌కి సంబంధించిన తీపి గుర్తులను ఇంటికి తీసుకెళ్లడం టీమిండియా సభ్యులకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనినే అలవాటు చేశాడని చెప్పాలి. గతంలో టీమిండియా సాధించిన చిరస్మరణీయ విజయాలకు సంబంధించి ధోని అనేక చిహ్నాలను తన వెంట తీసుకెళ్లేవాడు.

ఎల్ఈడీ స్టంప్స్‌తో ధోని కట్టడి
అయితే వన్డేల్లోకి ఎప్పుడైతే ఎల్ఈడీ స్టంప్స్ వచ్చాయో అప్పటి నుంచి అంఫైర్లు ధోనిని స్టంప్స్ తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఎందుకంటే ఎల్ఈడీ స్టంప్స్ చాలా ఖరీదు కాబట్టి. కాగా, టెస్టుల్లో అత్యంత వేగంగా 250 వికెట్లు తీసుకున్న బౌలర్‌గా డెన్నిస్ లిల్లీ పేరిట రికార్డు ఉంది. 48 టెస్టుల్లో లిల్లీ ఈ రికార్డుని నెలకొల్పాడు.

డెన్నిస్ లిల్లీ రికార్డుని అధిగమించిన అశ్విన్
అయితే ఇప్పుడు ఈ రికార్డుని అశ్విన్ అధిగమించాడు. 2011లో వెస్టిండిస్‌పై రవిచంద్రన్ అశ్విన్ టెస్టు అరంగ్రేటం చేశాడు. బంగ్లాదేశ్‌తో ప్రస్తుతం అశ్విన్ ఆడుతున్న టెస్టు మ్యాచ్ 45 టెస్టు మ్యాచ్ కావడం విశేషం. అశ్విన్ ఇప్పటి వరకు 24 సార్లు ఐదు వికెట్లు తీసుకున్నాడు.

250 వికెట్ల మైలురాయి చేరుకున్న 18వ బౌలర్
ఇదిలా ఉంటే టెస్టుల్లో 250 వికెట్ల మైలురాయి చేరుకున్న 18వ బౌలర్ అశ్విన్‌గా నిలిచాడు. భారత్ తరఫున 250, అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆరో బౌలర్ అశ్విన్ నిలిచాడు. అశ్విన్ కంటే ముందు బిషన్‌సింగ్ బేడి, కపిల్‌దేవ్, జహీర్, కుంబ్లే, హర్భజన్‌లు భారత్ తరుపున 250 వికెట్లు తీసిన వారి జాబితాలో ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications