Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతను టెస్టులకి పనికిరాడు: అశ్విన్‌కు స్పిన్ గ్రేట్ సలహా

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో ఇటీవల ముగిసిన టెస్టు సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా స్ఫిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలపై భారత స్పిన్ గ్రేట్ ఎర్రాపల్లి ప్రసన్న ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో అశ్విన్ ఒకడని కితాబిచ్చాడు.

అయితే అశ్విన్ బౌలింగ్ వేసేటప్పుడు బంతిని గాల్లో మరింత సేపు ఫ్లైట్‌ చేసేందుకు యత్నించాలని సలహా ఇచ్చారు. ఇంగ్లాండ్‌తో ముగిసిన టెస్టు సిరిస్‌లో అశ్విన్ 28 వికెట్లు తీసుకోవడంతో పాటు 304 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. భారత జట్టులో అశ్విన్ స్ట్రైకర్ బాల్ అనడంలో ఎటువంటి సందేహాం లేదని, ప్రస్తుత స్పిన్ ప్రపంచంలో అతడే నెంబర్ వన్ బౌలర్ అని కొనియాడాడు.

R Ashwin gets advice from spin great Erapalli Prasanna to flight theball more often

1970ల్లో బీఎస్ చంద్రశేఖర్, బిషన్ సింగ్ బేడీ, ఎస్ వెంకటేశ్వరన్‌లతో భారత స్పిన్‌ క్వాడ్రెంట్‌లో ముఖ్య భూమిక పోషించాడు. బెంగుళూరుకు చెందిన ఈ మాజీ అటగాడు జడేజాకు బ్యాట్స్‌మెన్‌ను చదవగలిగే సామర్థ్యం వచ్చేసిందని రాబోయే రోజుల్లో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తాడని అభిప్రాయపడ్డారు.

ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో రెండో ఎండ్‌లో అతను బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి గురి చేశాడని అభినందించాడు. ఇంగ్లాండ్ సిరిస్‌లో బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో అద్భుతంగా రాణించడంతో జయంత్‌యాదవ్‌ రూపంలో మరో ఆల్‌రౌండర్‌ దొరికాడని ఆయన అభిప్రాయపడ్డాడు. అయితే జయంత్ యాదవ్ స్పిన్ బౌలింగ్ టెస్టులకు సరిపోదని, లాంగ్‌ స్పెల్స్‌ వేయలేడని అన్నాడు.

టీ20లు, వన్డే మ్యాచ్‌లకు జయంత్ యాదవ్ ఆటతీరు చక్కగా సరిపోతుందని ఆయన తెలిపాడు. టెస్టుల్లో తనకు తాను నిరూపించుకున్నప్పటికీ అతను స్ట్రైక్‌ బౌలర్‌ కాదని తేల్చి చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+