Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హిట్‌మ్యాన్ లేకపోయినా ముంబై తోపే.. కానీ ఆ విషయంలోనే తుస్సు: అశ్విన్

ముంబై ఇండియన్స్ జట్టు ఆర్సీబీతో తలపడటానికి సిద్ధమవుతున్న వేళ.. టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ముంబై జట్టు బలాబలాలపై స్పందించాడు. "ముంబై జట్టు కేవలం రోహిత్ శర్మపైనే ఆధారపడిందని అనుకోవడం చాలా పొరపాటు. ముంబై బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంది. ముంబైకి రోహిత్ ఒక్కడే దిక్కు కాదు" అని రవిచంద్రన్ అశ్విన్ కుండబద్ధలు కొట్టాడు. ముంబై బ్యాటింగ్ విభాగంలో ఉన్న లోతును అశ్విన్ ప్రశంసించాడు.

ముంబై అసలు సమస్య బౌలింగ్
బ్యాటింగ్ గురించి మాట్లాడుతూనే ముంబై ఇండియన్స్ ఎదుర్కొంటున్న అసలు సవాళ్లను రవిచంద్రన్ అశ్విన్ ఎత్తిచూపాడు. ఈ సీజన్లో ముంబై జట్టును బౌలింగ్ విభాగం దెబ్బతీస్తోందని ఆయన అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా స్పిన్ విభాగం ఆశించిన స్థాయిలో రాణించడం లేదని.. జస్ప్రీత్ బుమ్రాకు మిగిలిన బౌలర్ల నుంచి తగిన మద్దతు లభించడం లేదని పేర్కొన్నారు. ఓపెనింగ్ బౌలర్లు కూడా ధారాళంగా పరుగులు ఇస్తుండటం హార్దిక్ పాండ్యా సేనకు తలనొప్పిగా మారిందని అశ్విన్ విశ్లేషించాడు.

R Ashwin Bold Claim Mumbai Indians Not Dependent on Rohit Sharma Ahead of RCB Clash in IPL 2026

ఆర్సీబీ మార్పులు చేయాలని సూచన
ఆర్సీబీ జట్టు గురించి మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఫామ్‌పై రవిచంద్రన్ అశ్విన్ అసహనం వ్యక్తం చేశాడు. గత సీజన్‌తో పోలిస్తే సాల్ట్ ఈసారి ఆత్మవిశ్వాసం కోల్పోయినట్లు కనిపిస్తోందని.. అతని స్థానంలో యువ ఆటగాడు జాకబ్ బెథెల్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. ఈ మార్పు ఆర్సీబీకి కొత్త ఉత్తేజాన్ని ఇచ్చే అవకాశం ఉందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.

పాయింట్ల పట్టికపై ప్రభావం
ఒకవేళ నేటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ గెలిస్తే.. ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక మరింత ఆసక్తికరంగా మారుతుందని అశ్విన్ అంచనా వేశాడు. మొదటి వారం మ్యాచ్‌లు అంతగా అలరించకపోయినా.. ఇప్పుడు టోర్నమెంట్ వేడెక్కుతోందని అన్నాడు. ముంబై, బెంగళూరు జట్ల మధ్య పోటీ అంటేనే అది రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీగా మారుతుందని, వాంఖడే స్టేడియంలో మరో భారీ స్కోర్ల మ్యాచ్ ఖాయమని అశ్విన్ జోస్యం చెప్పాడు. ఇదిలా ఉండగా.. ముంబై జట్టులో మిచెల్ శాంట్నర్, విల్ జాక్స్ వంటి ఆటగాళ్లు తిరిగి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అలాగే గత మ్యాచ్‌లో విఫలమైన రికెల్టన్ స్థానంలో క్వింటన్ డికాక్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా అశ్విన్ చేసిన ఈ కామెంట్స్ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల అభిమానుల్లో కాక రేపుతున్నాయి.

Story first published: Sunday, April 12, 2026, 15:43 [IST]
Other articles published on Apr 12, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+