For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హైదరాబాద్ చేతిలో ఓటమికి కారణం చెప్పిన పంజాబ్ కెప్టెన్

By Nageshwara Rao
R Ashwin bemoans Kings XI Punjab’s batting collapse vs Sunrisers Hyderabad

హైదరాబాద్: చెత్త బ్యాటింగ్‌, సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ కారణంగా తాము ఓడిపోయామని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. ఉప్పల్ స్టేడియంలో గురువారం రాత్రి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 13 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

కట్టుదిట్టంగా సన్ రైజర్స్ బౌలింగ్

కట్టుదిట్టంగా సన్ రైజర్స్ బౌలింగ్

మ్యాచ్ అనంతరం అశ్విన్ మాట్లాడుతూ 'చెత్త బ్యాటింగ్‌, సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ కారణంగా మేము ఓడిపోయాం. మిడిల్‌ ఆర్డర్‌లో వరుసగా వికెట్లు కోల్పోయాం. అతీగా ఎదురుదాడికి పోయి కొన్ని వికెట్లు చేజార్చుకున్నాం. మా జట్టులో మంచి ఫినిషర్లు ఉన్నప్పటికీ ఈరోజు రాణించలేకపోయారు' అని చెప్పాడు.

మా టీమ్‌లో నాణ్యమైన ఆటగాళ్లకు కొదవలేదు

మా టీమ్‌లో నాణ్యమైన ఆటగాళ్లకు కొదవలేదు

'అయితే సరైన సమయంలో రాణిస్తారన్న నమ్మకం మాకుంది. మా టీమ్‌లో నాణ్యమైన ఆటగాళ్లకు కొదవలేదు. ఈ మ్యాచ్‌లో మా ఫీల్డింగ్‌ అస్సలు బాలేదు 20 ఓవర్లలో మ్యాచ్‌లో ఎక్కువ క్యాచ్‌లు వదలేయడంతో చివరికి మూల్యం చెల్లించుకున్నాం. ఈ క్యాచ్‌లు పట్టివుంటే 20 నుంచి 30 పరుగులు తక్కువగా ఇచ్చేవాళ్లం. తర్వాత మ్యాచ్‌లో ఇలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తపడతాం' అని అశ్విన్‌ చెప్పాడు.

అంకిత్ రాజ్‌పుత్‌పై అశ్వివ్ ప్రశంసల వర్షం

అంకిత్ రాజ్‌పుత్‌పై అశ్వివ్ ప్రశంసల వర్షం

మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన అంకిత్ రాజ్‌పుత్‌పై అశ్వివ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అంకిత్‌ రాజ్‌పుత్‌ 14 పరుగులకే 5 వికెట్లు తీసి ఈ సీజన్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడని అశ్విన్ తెలిపాడు. తమ జట్టు ఓడిపోయినప్పటికీ అంకిత్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దక్కడం సంతోషంగా ఉందని చెప్పాడు.

పంజాబ్‌పై ప్రతీకారం తీర్చుకున్న హైదరాబాద్

పంజాబ్‌పై ప్రతీకారం తీర్చుకున్న హైదరాబాద్

గురువారం చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌‌లో పంజాబ్‌పై హైదరాబాద్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 133 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ను 19.2 ఓవర్లలో 119 పరుగులకే కట్టడి చేసింది. ఫలితంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి సన్‌రైజర్స్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్ ‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ జట్టు పంజాబ్కు 133 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

Story first published: Friday, April 27, 2018, 14:39 [IST]
Other articles published on Apr 27, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+