ఇండోర్: అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో మరోసారి నెంబర్ వన్ ర్యాంకుని సొంతం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఏకంగా 27 వికెట్లు తీసుకుని మ్యాన్ ఆఫ్ ద సిరిస్‌గా నిలిచిన అశ్విన్, తాజా ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్ధానాన్ని చేజిక్కించుకున్నాడు.
అంతేకాదు టెస్టుల్లో నెంబర్ వన్ ఆల్ రౌండర్‌గా కూడా నిలిచాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో ఏడు కలిపి మొత్తం 13 వికెట్లు తీసుకుని కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఇప్పటి వరకు కెరీర్‌లో 39 టెస్టులు ఆడిన అశ్విన్.. 220 వికెట్లు తీశాడు.
ఈ ఏడాది ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో అశ్విన్ నెంబర్ వన్ బౌలర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. క్రికెట్ చరిత్రలోనే 39 టెస్టుల్లో ఇన్ని వికెట్లు ఎవరూ తీయకపోవడం గమనార్హం. న్యూజిలాండ్‌తో ఇండోర్ టెస్ట్ మొదలవ్వడానికి ముందు అశ్విన్ మూడో స్థానంలో ఉన్నాడు.

ఇక, అశ్విన్ తన క్రికెట్ కెరీర్‌లో 900 పాయింట్లు అందుకున్నాడు. 2000 తర్వాత కేవలం మురళీధరన్, మెక్‌గ్రాత్, ఫిలాండర్, స్టెయిన్, పొలాక్ మాత్రమే 900 పాయింట్లు అందుకున్నవారిలో ఉన్నారు. ఇక బ్యాట్స్ మెన్ జాబితాలో రహానే కెరీర్ బెస్ట్ ఆరో ర్యాంకు అందుకున్నాడు.
ఇండోర్ టెస్టుకు ముందు 11వ స్థానంలో ఉన్న రహానే 188, 23 నాటౌట్ పరుగులతో ఐదు స్థానాలు ఎగబాకాడు. ఇక పుజారా, కోహ్లి కూడా తమ ర్యాంకులను మెరుగుపరచుకొని వరుసగా 14, 16 స్థానాల్లో నిలిచారు.
వందేళ్లలో ఎవరికీ సాధ్యం కాని రికార్డు అశ్విన్ సొంతం
వందేళ్లలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డుని అశ్విన్ సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో స్ట్రయిక్ రేట్ పరంగా చూస్తే, గత వందేళ్లలో అశ్విన్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. 49.4 స్ట్రయిక్ రేట్‌తో అశ్విన్ కొనసాగుతున్నాడు. ఈ వందేళ్ల కాలంలో ఇంతవరకు 50 కన్నా తక్కువ స్ట్రయిక్ రేట్ గల బౌలర్లు ఎవరూ లేకపోవడం గమనార్హం. అశ్విన్ తర్వాత 54 స్ట్రయిక్ రేట్‌తో మెక్ గిల్ (ఆస్ట్రేలియా), 55 స్ట్రయిక్ రేట్‌తో ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక)లు ఉన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి బీఎస్ చంద్రశేఖర్ (13), అనిల్ కుంబ్లే (14) ఉన్నారు.
ICC Test Rankings for bowlers (As on October 12, 2016 after India-New Zealand series):
(Read as Rank, Player, Rating Points)
1. Ravichandran Ashwin (India) 900
2. Dale Steyn (South Africa) 878
3. James Anderson (England) 870
4. Stuart Broad (England) 836
5. Rangana Herath (Sri Lanka) 831
6. Yasir Shah (Pakistan) 806
7. Ravindra Jadeja (India) 805
8. Mitchell Starc (Australia) 792
9. Neil Wagner (New Zealand) 731
10. Vernon Philander (South Africa) 723