Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబైలో రికార్డుల మోత: కపిల్ రికార్డుని సమం చేసిన అశ్విన్

హైదరాబాద్: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముంబైలో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్ల మధ్య గురువారం నాలుగో టెస్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తొలి రొజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు నష్టపోయి 288 పరుగులు చేసింది. ఇందులో అశ్విన్ ఒక్కడే నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఇక 288/5 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజైన శనివారం ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌ని అశ్విన్ ఆదిలోనే దెబ్బతీశాడు.

బెన్ స్టోక్స్‌ను 31 వ్యక్తిగత పరుగుల వద్ద అవుట్ చేయడంతో అశ్విన్ తన ఖాతాలో ఐదు వికెట్లు వేసుకున్నాడు. దీంతో టీమిండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ రికార్డుని అశ్విన్ సమం చేశాడు. భారత్ తరపున ఐదు వికెట్లను కపిల్ దేవ్ 23 సార్లు సాధించిన సంగతి తెలిసిందే.

5 వికెట్లు తీసిన భారత బౌలర్లలో మూడో స్థానం

5 వికెట్లు తీసిన భారత బౌలర్లలో మూడో స్థానం

తాజాగా ముంబై టెస్టులో ఈ ఘనతను సాధించి అత్యధికంగా 5 వికెట్లు తీసిన భారత బౌలర్లలో మూడో స్థానంలో నిలిచాడు. కాగా, అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన భారత బౌలర్లలో అనిల్ కుంబ్లే (35) తొలిస్థానంలో ఉండగా, హర్భజన్ సింగ్ (25) రెండోస్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరిస్‌లో అశ్విన్ ఐదు వికెట్లు తీయడం ఇది రెండో సారి. విశాఖలో జరిగిన టెస్టులో అశ్విన్‌ ఐదు వికెట్లు తీసుకున్నాడు.

ఇంగ్లాండ్‌పై అశ్విన్‌ ఐదు వికెట్లు తీయడం ఇది ఐదోసారి

ఇంగ్లాండ్‌పై అశ్విన్‌ ఐదు వికెట్లు తీయడం ఇది ఐదోసారి

మొత్తంగా చూస్తే ఇంగ్లాండ్‌పై అశ్విన్‌ ఐదు వికెట్లు తీయడం ఇది ఐదోసారి. తాజా ఐదు వికెట్లతో అశ్విన్ 2016లో ఐదు వికెట్లను ఏడోసార్లు తీసుకున్నట్లైంది. ఒకే ఏడాది అత్యధికంగా ఈ రికార్డుని సాధించిన మొట్టమొదటి బౌలర్‌గా కూడా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం టీమిండియా విజయాల్లో అశ్విన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2016లో అశ్విన్ అత్యుత్తమ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు టెస్టుల్లో అశ్విన్ 47 వికెట్లు తీసుకున్నాడు.

పరుగులు

పరుగులు

1969లో ఎర్రపల్లి ప్రసన్న ఒకే ఏడాదిలో 46 వికెట్లు తీసుకున్నాడు. ఇప్పుడు అతడు రికార్డుని కూడా అశ్విన్ అధిగమించాడు. తమిళనాడుకు చెందిన ఈ ఆల్ రౌండర్ ఇంతకముందే మరో రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో ఒక కేలండర్ ఇయర్‌లో 50 వికెట్లు తీసుకోవడంతో పాటు 500కు పైగా పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా అశ్విన్ మరో ఘనతను అందుకున్నాడు.

ప్రపంచ వ్యాప్తంగా కేవలం ఏడుగురు ఆటగాళ్లు మాత్రమే

ప్రపంచ వ్యాప్తంగా కేవలం ఏడుగురు ఆటగాళ్లు మాత్రమే

టీమిండియా మాజీ కెప్టెన్, ఆల్ రౌండర్ కపిల్ దేవ్ 1979 (619 పరుగులు, 74 వికెట్లు), 1983 (579 పరుగులు, 75 వికెట్లు) రెండు సార్లు ఈ ఫీట్‌ని సాధించాడు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఈ ఘనతను కేవలం ఏడుగురు ఆటగాళ్లు సాధించారు. ఇంగ్లాండ్ ఇయాన్ బోథమ్ (రెండుసార్లు), దక్షిణాఫ్రికా షాన్ పొల్లాక్ (రెండుసార్లు), మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా), డానియేల్ వెటోరి (న్యూజిలాండ్), ఆండ్రూ ఫ్లింటాప్ (ఇంగ్లాండ్)లు మిగతా ఐదుగురిలో ఉన్నారు.

జవగళ్ శ్రీనాథ్ (236 వికెట్లు) టెస్టు వికెట్లను అధిగమించిన అశ్విన్

జవగళ్ శ్రీనాథ్ (236 వికెట్లు) టెస్టు వికెట్లను అధిగమించిన అశ్విన్

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టులో మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ (236 వికెట్లు) టెస్టు వికెట్లను అశ్విన్ అధిగమించాడు. ముంబై వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ మొయిన్ అలీ వికెట్‌ను తీయడంతో భారత్ తరుపున అత్యధిక వికెట్లు సాధించిన ఏడో బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఘనత సాధించాడు. దీంతో మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ (236 వికెట్లు) టెస్టు వికెట్లను అశ్విన్ అధిగమించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+