2000 పరుగులు, 200 వికెట్లు: దిగ్గజాల సరసన అశ్విన్
హైదరాబాద్: కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. రెండో రోజైన శుక్రవారం లంచ్ విరామ సమాయానికి 47 పరుగులతో ఉన్న అశ్విన్, లంచ్ అనంతరం హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
ఈ సిరిస్‌లో అశ్విన్‌కు ఇది రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇన్నింగ్స్ 121.4వ ఓవర్లో హెరాత్ వేసిన బంతిని ఎదుర్కొన్న అశ్విన్ ఆ బంతిని సిక్స్‌గా మలిచి కెరీర్‌లో 11వ హాఫ్ సెంచరీని నమోదు చేసి తద్వారా టెస్టుల్లో రెండు వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
2000 పరుగులు, 200 వికెట్లు
తద్వారా భారత్ తరుపున టెస్టుల్లో 2000 పరుగులు, 200 వికెట్లు తీసిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందాడు. కెరీర్లో 51 టెస్టు మ్యాచ్ ఆడుతున్న అశ్విన్ కొలంబో టెస్టులో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో చేరాడు. అశ్విన్‌కు ముందు ఈ ఫీట్‌ని ఇయాన్ బోథమ్ (42 టెస్టులు), కపిల్ దేవ్(50), ఇమ్రాన్ ఖాన్ (50)లు సాధించారు.
54 టెస్టుల్లో ఈ మైలు రాయిని అందుకున్న సర్ రిచర్డ్ హ్యాడ్లీ
న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ సర్ రిచర్డ్ హ్యాడ్లీ 54 టెస్టుల్లో ఈ మైలు రాయిని అందుకున్నాడు. కొలంబో టెస్టులో పుజారా (133), రహానే (132) పరుగుల వద్ద అవుటైన ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్, వృద్ధిమాన్ సాహాలు స్కోరు బోర్డుని పరిగెత్తించారు. పుజారా స్థానంలో క్రీజులోకి వచ్చిన అశ్విన్.. రహానెకి జత కలిశాడు.

ఐదో వికెట్‌కి 63 పరుగుల భాగస్వామ్యం
ఇద్దరూ కలిసి వీలు చిక్కినప్పుడల్లా పరుగులు రాబడుతూ స్కోరు బోర్డును కదిలించారు. ఈ ఇద్దరూ కలిసి ఐదో వికెట్‌కి 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత కాసేపటికే రహానే కూడా అవుటయ్యాడు. దీంతో లంచ్ విరామ సమయానికి భారత్ 5 వికెట్లకు 442 పరుగులు చేసింది.

హాఫ్ సెంచరీ తర్వాత అవుటైన అశ్విన్
లంచ్ విరామం అనంతరం అర్ధసెంచరీ చేసిన అశ్విన్ ఆ తర్వాతి బంతికే అవుటయ్యాడు. 121.5వ ఓవర్లో హెరాత్ వేసిన బంతి నేరుగా వెళ్లి వికెట్లను తాకడంతో జట్టు స్కోరు 451 వద్ద అశ్విన్ పెవిలియన్‌కు చేరాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications