Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రవిచంద్రన్ అశ్విన్ రిటైర్డ్ అవుట్: ఐపీఎల్‌లో మొదటిసారిగా.. షాకింగ్

R Ashwin became the first batter to be retired out in the IPL as he ran back to the dressing room

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా ఆదివారం ముగిసిన డబుల్ హెడ్డర్స్.. అనూహ్య ఫలితాలను ఇచ్చాయి. వరుసగా రెండు మ్యాచ్‌లల్లో ఓటమిపాలైన ఢిల్లీ కేపిటల్స్- అద్భుతంగా రిటర్న్ బ్యాక్ అయింది. ప్రత్యర్థి కోల్‌కత నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ చెలరేగారు. జట్టు భారీ స్కోర్ చేయడానికి వారిద్దరి భాగస్వామ్యమే కీలకం. ప్రత్యేకించి- డాషింగ్ ఓపెనర్ వార్నర్ బ్యాటింగ్ గాడిన పడటం ఢిల్లీ కేపిటల్స్‌కు గుడ్ సైన్.

లక్నో దూకుడుకు కళ్లెం..

మరో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయఢంకా మోగించింది. లక్నో సూపర్ జెయింట్స్ దూకుడుకు కళ్లెం వేసింది. వరుసగా నాలుగో విజయంపై కన్నేసిన లక్నోకు షాక్ ఇచ్చింది. ఓ మోస్తరు పరుగులే చేసినప్పటికీ.. దాన్ని కాపాడుకోగలిగింది రాజస్థాన్. లక్నోను మూడు పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో పింక్ టీమ్.. పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. మూడు మ్యాచ్‌ల అనంతరం లక్నో ఓడిపోవడం ఇదే తొలిసారి. అయిదో స్థానంలో నిలిచిందీ కేఎల్ రాహుల్ టీమ్.

అశ్విన్ రిటైర్డ్ అవుట్..

కాగా- ముంబై వాంఖెడె స్టేడియం వేదికగా జరిగిన రాజస్థాన్-లక్నో మ్యాచ్‌లో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. రవిచంద్రన్ అశ్విన్ రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో ఈ రకంగా పెవిలియన్ చేరిన మొట్టమొదటి ప్లేయర్.. అతనే. టీ20 ఫార్మట్ క్రికెట్‌లో మాత్రం ఇలాంటి సందర్భాలు మూడు ఉన్నాయి. ఇప్పటివరకు ముగ్గురు బ్యాటర్లు ఇలా రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగారు. పాకిస్తాన్ తరఫున షాహిద్ అఫ్రిది, భూటాన్ ప్లేయర్ సోనమ్ టోగ్బే, బంగ్లాదేశ్ క్రికెటర్ సుంజాముల్ ఇస్లాం.. ఇలా క్రీజ్ మధ్యలో నుంచే అవుట్ కాకుండా పెవిలియన్ చేరారు. ఆ జాబితాలో ఇఫ్పుడు తాజాగా రవిచంద్రన్ అశ్విన్ కూడా చేరాడు.

ఇంకాస్సేపట్లో ఇన్నింగ్ ముగుస్తుందనగా..

ఇంకాస్సేపట్లో ఇన్నింగ్ ముగుస్తుందనగా.. ఈ ఘటన చోటు చేసుకుంది. 18.2వ ఓవర్‌లో అశ్విన్ హఠాత్తుగా పెవిలియన్ దారి పట్టాడు. అతను అవుట్ కాలేదు. రిటైర్డ్ అవుట్‌గా ప్రకటించుకున్నాడు. అప్పటికే అతను 23 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఇందులో రెండు సిక్సర్లు ఉన్నాయి. షిమ్రోన్ హెట్మెయిర్‌తో కలిసి అయిదో వికెట్‌కు 68 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. అశ్విన్ స్థానంలో రియాన్ పరాగ్ క్రీజ్‌లోకి వచ్చాడు. పరాగ్- చివరి ఓవర్ అయిదోబంతికి అవుట్ అయ్యాడు. నాలుగు బంతుల్లో ఒక సిక్స్‌తో ఎనిమిది పరుగులు చేశాడు.

నో ఐడియా..

నో ఐడియా..

కాగా- అశ్విన్ అవుట్ కాకుండానే పెవిలియన్ దారి పట్టడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అతనితో పాటు క్రీజ్‌లో ఉన్న షిమ్రోన్ హెట్మెయిర్‌కు కూడా దీనిపై ముందస్తుగా ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయాన్ని అతనే స్వయంగా చెప్పుకొచ్చాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం హెట్మెయిర్ మాట్లాడడు. అశ్విన్ వెనుదిరుగుతాడనే విషయం ముందుగా తెలియదని, తనకూ ఆశ్చర్యాన్ని కలిగించిందని వ్యాఖ్యానించాడు. అలసిపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని చెప్పాడు. అశ్విన్ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన సిక్స్‌ కొట్టాడని, అదే జట్టును గెలిపించిందని చెప్పాడు.

Story first published: Monday, April 11, 2022, 7:44 [IST]
Other articles published on Apr 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+