Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

16 ఫోర్లు 11 సిక్సర్లు, 178 రన్స్: కంగారూలు ఖతమ్

సెంచూరియన్: దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డీ కాక్ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆస్ట్రేలియా బౌలింగును చీల్చి చెండాడుతూ అతను 113 బంతుల్లో 178 పరుగులు చేశాడు. అందులో 16 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి వన్డే మ్యాచును ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా గెలుచుకుంది.

ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన 295 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో డీకాక్, రస్కోల జోడీ బౌండరీ లైన్‌ను టార్గెట్ చేసుకుని ఆస్ట్రేలియా బౌలర్లను చెండాడుతు వచ్చారు. రస్కో 45 బంతుల్లో పది ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 63 పరుగులు చేశాడు.

Quinton de Kock scores 178 in South Africa’s six wicket win over Australia

రస్కో, డికాక్ జోడీ తొలి వికెట్‌కు 145 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. రస్కో అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన డు ప్లెసిస్ (26) కాస్తా నెమ్మదిగానే ఆడాడు. చివరలో డేవిడ్ మిల్లర్ (10 నాటౌట్), బెహర్దియన్ (5 పరుగులు) లాంఛనం పూర్తి చేశారు.

దక్షిణాఫ్రికా 36.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. అంతకు ముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కంగారూలను బ్యాటింగ్‌కు దింపింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌లో డేవిడ్ వార్నర్ (40), ఫించ్ (33), హాస్టింగ్స్ (51), మిచెల్ మార్ష్ (31) రాణించారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+