For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Quinton De kock : మూడు ఫార్మాట్లలో ఆడడం ఆటగాళ్లకు కష్టమే.. వ్యక్తిగతంగా ప్లేయర్లు ఏది బెస్టో ఎంచుకోవాలి

Quinton De Kock Says Playing in All Three Formats is Tuff, Players Need To choose Their Best

దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ కం స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్.. క్రికెట్లో మూడు ఫార్మాట్లలో ఆడడం ఆటగాళ్లకు కష్టంగా మారుతుందని పేర్కొన్నాడు. బిజీ షెడ్యూళ్ల వల్ల బెన్ స్టోక్స్ వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్ ప్యాక్డ్ షెడ్యూళ్లతో ఉండడంతో తాను 100శాతం ప్రదర్శన వన్డేల్లో ఇవ్వలేకపోతున్నానని స్టోక్స్ తెలిపిన సంగతి తెలిసిందే. చాలా మంది క్రికెట్ ప్రముఖులు స్టోక్స్ నిర్ణయాన్ని సమర్థించారు. వసీం అక్రమ్ లాంటి దిగ్గజ క్రికెటర్లు సైతం వన్డే ఫార్మాట్‌‌కు కాలం చెల్లిందని పేర్కొన్నారు. ఇకపోతే దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్‌ మధ్య ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌ చివరి మ్యాచ్‌లో డికాక్ 76బంతుల్లో 92 పరుగులు చేసి సత్తా చాటాడు. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయింది. దీంతో ఈ సిరీస్ 1-1తో సమమైంది.

ఫాక్స్ స్పోర్ట్స్‌తో ఈ మ్యాచ్ అనంతరం డికాక్ మాట్లాడుతూ.. మూడు ఫార్మాట్లలో ఆడటం కఠినంగా అనిపిస్తుందని.. అందువల్ల ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా క్రికెటర్లు ముందుకెళ్లడం చాలా కష్టమని డికాక్ అన్నాడు. గతేడాదే టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన డికాక్.. ప్లేయర్లు మూడు ఫార్మాట్ల విషయమై వాళ్ల వ్యక్తిగతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. 'ఆటగాళ్లకు మూడు ఫార్మాట్లలో ఆడడం చాలా కఠినంగా ఉంటోంది. అంతర్జాతీయ క్యాలెండర్‌లో చాలా మ్యాచ్‌లు షెడ్యూల్ అవుతున్నట్లు కన్పిస్తోంది. ప్లేయర్లు వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవాలి. వారు మూడు ఫార్మాట్లు ఆడగలమని భావిస్తే ఆడొచ్చు. కొందరి వల్ల అది సాధ్యమవుతుంది. సాధ్యం కాని వారు మాత్రం తమ వ్యక్తిగత అభిమతం మేరకు తమకు ఏది బెస్ట్ అనిపిస్తుందో దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. నేను అదే చేశాను. నేను ఇప్పుడు టీ20, వన్డేలు ఆడుతున్నాను. నేను ఆడుతున్న ఆట పట్ల ప్రస్తుతం సంతోషంగా ఉన్నాను' అని డికాక్ చెప్పాడు. వన్డే క్రికెట్ మీద ఇటీవల విమర్శలు ఎక్కువవుతుండగా.. ఈ విషయమై డికాక్ స్పందించాడు. నాతో సహా ఎంతో మంది ఆటగాళ్లు ఇప్పటికీ 50ఓవర్ల ప్రపంచకప్ గెలవాలని కలలు కంటున్నారు. అందువల్ల దీనికి అపురూపమైన
భవిష్యత్తు ఉంది' అని డికాక్ పేర్కొన్నాడు.

Story first published: Monday, July 25, 2022, 16:37 [IST]
Other articles published on Jul 25, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+