Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

"Bush Pig" అన్నాడు: వార్నర్‌కు వార్నింగ్ ఇచ్చిన డీకాక్ సోదరి

Quinton de Kock’s sister warns David Warner over the ugly fallout

హైదరాబాద్: డర్బన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా సాధించిన విజయం కంటే కూడా డేవిడ్ వార్నర్-క్వింటన్ డీకాక్‌ల మధ్య చోటు చేసుకున్న ఘటనే హైలెట్‌గా నిలిచింది. మాజీ క్రికెటర్లు సైతం ఈ టెస్టులో మిచెల్ స్టార్క్, అయిడెన్ మర్క్రమ్ అద్భుత ప్రదర్శన గురించి కాకుండా వార్నర్-డీకాక్ గొడవ గురించే స్పందిస్తున్నారు.

వీరిద్దరి గొడవపై ఇప్పటికే ఇరు జట్లకు చెందిన పలువురు మాజీ క్రికెటర్లు స్పందంచగా... తాజాగా క్వింటన్ డీకాక్ సోదరి ట్విట్టర్ వేదికగా ఆస్ట్రేలియా వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు వార్నింగ్ ఇచ్చింది. డీకాక్ సోదరి డాలీన్ డీకాక్ తన ట్విట్టర్‌లో "వాట్ ద ఫక్. వార్నర్ నేను నిన్ను హర్ట్ చేస్తా" అని ట్వీట్ చేసింది.

క్రికెట్‌లో స్లెడ్జింగ్ అనేది సాధారణం. అయితే డర్భన్ వేదికగా తొలి టెస్టులో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు కాస్త శృతిమించారని క్రీడా పండితులు సైతం అంటున్నారు. మర్క్రమ్, డీకాక్‌లు క్రీజులో పాతుకుపోయి నిలకడగా ఆడుతూ ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన సమయంలో డీకాక్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు వార్నర్ స్లెడ్జ్ చేసినట్లు సమాచారం.

ఈ సమయంలో డీకాక్ కూడా కాస్తంత ఘాటుగానే సమాధానమిచ్చాడు. అదే సమయంలో వార్నర్ కాస్త దూకుడు పెంచి డీకాక్ కుటుంబాన్ని "Bush Pig" అన్నట్లు దక్షిణాఫ్రికా స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ, టీ విరామ సమయంలో వీరిద్దరూ డ్రెస్పింగ్ రూమ్‌కి వెళ్లేటప్పుడు మెట్ల వద్ద తీవ్ర వాగ్వాదానికి దిగారు.

సహచర ఆటగాళ్లు వద్దు వద్దు అని వారిస్తున్నా వార్నర్ దూకుడు ప్రదర్శించాడు. దీనికి డికాక్‌ కూడా దీటుగానే సమాధానం ఇచ్చాడు. అయితే, సహచరులు టిమ్‌ పైన్‌, ఖవాజా, ఓ అధికారి వారిస్తున్నా వినకుండా వార్నర్‌.. క్వింటన్‌ను కొట్టేందుకు దూసుకెళ్లాడు. ఈ గొడవ ఎక్కువవడంతో సఫారీ డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న ఆ జట్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌ బయటకు వచ్చాడు.

ఆ తర్వాత కాసేపటికి కెప్టెన్‌ స్మిత్‌ వచ్చి వార్నర్‌ను డ్రస్సింగ్ రూమ్‌లోకి తీసుకువెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో మొత్తం కింగ్స్ మీడ్ స్టేడియంలో మెట్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియోను స్థానిక మీడియా బయటపెట్టడంతో ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి క్రికెట్ ఆస్ట్రేలియా విచారణకు ఆదేశించింది.

గొడవ ఎలా మొదలైందో అనే విషయంపై విచారణ చేస్తున్నామని, నిజానిజాలు తెలిసేవరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోబోమని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారి ఒకరు తెలిపారు. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా నివేదిక ప్రకారం డేవిడ్ వార్నర్ భార్య కాండిస్‌‌పై డీకాక్ అవమానకరమైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఈ గొడవపై స్పందించాడు.

క్వింటన్ డికాక్.. డేవిడ్ వార్నర్‌‌ని వ్యక్తిగతంగా దూషించడం వల్లే గొడవ మొదలైందని స్మిత్ పేర్కొన్నాడు. 'మేము మైదానంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లతో చాలా సంతోషంగా ఉన్నాం. క్వింటన్‌‌తో మాకు ఎటువంటి గొడవ జరుగలేదు. కానీ డికాక్ మాత్రం అతని పరిథి దాటి మాట్లాడాడు. నా దృష్టిలో ఇది చాలా తప్పు. ఇప్పుడు ఇక నిర్ణయం అధికారుల చేతిలో ఉంది. మేం మాత్రం క్రీడాస్పూర్తిని పాటిస్తూ ఆడుతున్నాం' అని స్మిత్ అన్నాడు.

వార్నర్ భార్య కాండిస్ గురించి డీకాక్ ఏం కామెంట్ చేశాడనే దానిపై స్పష్టత లేదు. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన ఓ వెబ్‌సైట్ తెలిపింది. కాండిస్‌పై డికాక్‌ కామెంట్‌ చేశాడని.. అదే అతని ఆగ్రహానికి కారణమై ఉండొచ్చని అందులో పేర్కొంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కాండిస్‌ ఆస్ట్రేలియా ప్రొఫెషనల్‌ ట్రయాథ్లెట్‌, మోడల్‌, సర్ఫ్‌ లైఫ్‌ సేవర్‌.

డేవిడ్ వార్నర్‌ను పెళ్లి చేసుకోవడానికి ముందు ఆమె పలువురు స్టార్‌ ప్లేయర్లతో డేటింగ్‌ చేసింది. వీటిని దృష్టిలో ఉంచుకొనే డికాక్‌ ఆమెపై కామెంట్‌ చేసి ఉంటాడనీ.. ఇదే గొడవకు కారణమై ఉంటుందని ఆ వెబ్‌సైట్‌ వెల్లడించింది.

Story first published: Tuesday, March 6, 2018, 16:20 [IST]
Other articles published on Mar 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+