Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆట మొదలవకుండానే వికెట్లు పడిపోతున్నాయా..

Quinton de Kock a Doubtful Starter for India Series

హైదరాబాద్: దక్షిణాఫ్రికా టూర్‌కి వెళ్లకముందే సీనియర్ల హితవులు పెరిగిపోతున్నాయి. కొందరు క్రీడాకారులేమో సవాల్లు విసురుకుంటున్నారు. మరికొందరేమో ఇప్పటి నుంచే శిక్షణలో ప్రావీణ్యం పొందుతున్నారు. మరి గాయాల కారణంగా ఆటకు వస్తారో లేదో అన్న వాళ్ల పరిస్థితి ఏమైనట్టు..

దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ డీకాక్‌ కూడా కేప్‌టౌన్‌లో జరిగే టెస్టుకు అందుబాటులో ఉండే దానిపై అనుమానాలు నెలకొన్నాయి. భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జనవరి 5నుంచి మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఇందుకోసం కోహ్లీ సేన ఇప్పటికే దక్షిణాఫ్రికాకు పయనమైన సంగతి తెలిసిందే.

ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభానికి ముందే ఆటగాళ్ల గాయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కాలి గాయం కారణంగా భారత ఆటగాడు శిఖర్‌ ధావన్‌ తొలి టెస్టులో ఆడే దానిపై అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ డీకాక్‌ బరిలోకి దిగే దానిపైనా జట్టు మేనేజ్‌మెంట్‌ ఒక అంచనాకు రాలేకపోతుంది.

జింబాబ్వేతో జరిగిన నాలుగు రోజుల టెస్టు తొలి రోజు ఆటలో డీకాక్‌ గాయపడ్డాడు. దీంతో రెండో రోజు ఆటలో అతడు కనీసం మైదానంలోకి కూడా రాలేదు. వికెట్‌ కీపర్‌ బాధ్యతలను ఏబీ డివిలియర్స్‌ అందుకున్నాడు. జ్వరం కారణంగా డూప్లిసిస్‌ కూడా ఈ టెస్టుకు దూరమయ్యాడు.

వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఏడాది తర్వాత జట్టులోకి వచ్చిన డేల్‌ స్టెయిన్‌ కూడా తుది జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. టెస్టుల్లో నంబర్‌వన్‌ స్థానంలో కొనసాగుతోన్న కోహ్లీ సేనను ఎదుర్కోవాలంటే ఈ ఇద్దరు ఆటగాళ్లు కీలకమే. తొలి టెస్టు ప్రారంభానికి వారం రోజులు పైగా సమయం ఉండటంతో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దక్షిణాఫ్రికా మేనేజ్‌మెంట్‌ తెలిపింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 29, 2017, 10:01 [IST]
Other articles published on Dec 29, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+