ముంబై కుళ్లికుళ్లి ఏడ్చేలా డికాక్ బ్యాటింగ్.. ఒక్క ఇన్నింగ్స్ దెబ్బకు పిట్టల్లా రాలిన రికార్డులు

గత సీజన్ వరకు ముంబై స్క్వాడ్‌లో ఓపెనర్‌గా, కీపర్‌గా రాణించిన క్వింటన్ డికాక్‌ను కొనకుండా ముంబై పెద్ద తప్పే చేసింది. ఎందుకంటే కేకేఆర్‌తో నేడు జరుగుతున్న మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ చెలరేగిన విధానం చూస్తే ముంబై కుళ్లికుళ్లి ఏడ్చే ఉంటుంది. ఫోర్లు, సిక్సులతో క్వింటన్ డికాక్ (140పరుగులు 70బంతుల్లో 10ఫోర్లు, 10సిక్సులు నాటౌట్) కేకేఆర్ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. బౌండరీల ద్వారానే డికాక్ 100పరుగులు పిండుకున్నాడు. అతని సెంచరీకి తోడు కెప్టెన్ కేఎల్ రాహుల్ (68పరుగులు 51బంతుల్లో 3ఫోర్లు 4సిక్సర్లు నాటౌట్) రాణించడంతో ఒక్క వికెట్ కోల్పోకుండా లక్నో సూపర్ జెయింట్స్ 210పరుగుల భారీ స్కోరు చేసింది.
ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో డికాక్ ఎన్నో రికార్డులను అందుకున్నాడు. అందులో కొన్ని వ్యక్తిగతమైనవి కాగా.. మరికొన్ని ఇతరాలు ఉన్నాయి. తన ఓపెనింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లపై విరుచుకుపడే డికాక్.. కన్సిస్టెన్సీ ప్లేయర్ కూడా. ఎంతో కొంత అతని నుంచి జట్టుకు మేలు జరిగే ఇన్నింగ్స్ వస్తాయి. ఇక ఈ సీజన్లో లక్నో కొనుగోలు చేసిన బెస్ట్ ప్లేయర్లలో డికాక్ ఒకడు. మెగావేలంలో 6.75కోట్లకు డికాక్‌ను లక్నో దక్కించుకుంది. ఇక పెట్టిన పైసలకు తగ్గట్లు డికాక్ ఈ సీజన్లో 14మ్యాచ్‌లు ఆడి 502పరుగులు చేశాడు. అందులో మూడు హాఫ్ సెంచరీలు సహా, ఒక సెంచరీ ఉంది. అతని స్ట్రైక్ రేట్ 149గా ఉంది.

కేకేఆర్ మీద అత్యధిక భాగస్వామ్యం
2016సీజన్లో ఆర్సీబీ తరఫున ఆడిన డికాక్ ఐపీఎల్లో తన తొలి సెంచరీ (108పరుగుల) ఢిల్లీపై చేశాడు. ఇక తాజాగా ఈ సీజన్లో కోల్‌కతాపై రెండో సెంచరీ చేశాడు. అలాగే ఐపీఎల్లో డికాక్‌కు తాజా సెంచరీ (140పరుగులు) అత్యధిక స్కోరు. ఈ క్రమంలో కేకేఆర్ జట్టుపై ఏ వికెట్‌కు అయిన అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా కేఎల్ రాహుల్, డికాక్ జోడీ నిలిచింది. అంతకుముందు 2012లో గిబ్స్, రోహిత్ కలిసి కేకేఆర్ మీద 167పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేయగా.. ఆ రికార్డును బద్దలు కొట్టిన రాహుల్, క్వింటన్ డికాక్ జోడీ 210పరుగులతో అత్యధిక భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా నిలిచింది.

అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్య రికార్డు
ఇక ఐపీఎల్లో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం రికార్డు కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ జోడీ(210) పేరిట నమోదైంది. ఇక ఏ వికెట్‌కు అయిన అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన రికార్డులోనూ కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ జోడీ మరో రికార్డును నమోదు చేసింది. 2016లో కోహ్లీ, డివిలియర్స్ జోడీ 229పరుగుల భాగస్వామ్యాన్ని గుజరాత్ లయన్స్ పై నమోదుచేయడం అత్యధికం కాగా తర్వాత అదే జోడీ 2015లో ముంబైపై 215పరుగుల భాగస్వామ్యాన్ని నమోదుచేసింది. ఇక మూడో స్థానంలో కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ జోడీ (210) ఉంది.

అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డ్
ఇక అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డ్‌లోనూ క్వింటన్ డికాక్ టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు. తాజా ఇన్నింగ్స్‌తో మూడో స్థానానికి చేరుకున్నాడు. తొలి స్థానంలో క్రిస్ గేల్ ( ఆర్సీబీ) - 175పరుగులు నాటౌట్ ఉండగా, రెండో స్థానంలో బ్రెండన్ మెక్కల్లమ్ (కేకేఆర్) - 158నాటౌట్ ఉన్నాడు. మూడో స్థానంలో క్వింటన్ డికాక్ (లక్నో) - 140పరుగులు నాటౌట్ ఉన్నాడు. ఇక 4, 5 స్థానాల్లో వరుసగా ఏబీ డివిలియర్స్ (ఆర్సీబీ) - 133నాటౌట్, కేఎల్ రాహుల్ (పంజాబ్ కింగ్స్ ) - 132 టాప్ 5లో ఉన్నారు. ఇక తాజా మ్యాచ్ ద్వారా ఇక 20ఓవర్లపాటు వికెట్ కోల్పోకుండా ఆడిన తొలి జట్టుగా లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయింది.

లక్నో వర్సెస్ కోల్ కతా తుది జట్లు:
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): వెంకటేష్ అయ్యర్, అభిజీత్ తోమర్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నితీష్ రాణా, సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌతీ, వరుణ్ చకరవర్తి
లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), కేఎల్ రాహుల్(కెప్టెన్), ఎవిన్ లూయిస్, దీపక్ హుడా, మనన్ వోహ్రా, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, కృష్ణప్ప గౌతమ్, మొహసిన్ ఖాన్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications