
ఫ్రస్ట్రేషన్ వల్లే అలా
'నేను సెంచరీ తర్వాత కాస్త ఆవేశానికి లోనయ్యాను. కానీ నా ఇన్నింగ్స్ ద్వారా రిఫ్రెష్మెంట్ పొందడంతో అలా సెలబ్రేట్ చేసుకున్నాను. నేను నా ఫామ్ కొనసాగాలని కోరుకుంటున్నాను. చాలా రోజుల నుంచి ఫ్రస్టేషన్‌కు గురి కావడం వల్ల సెంచరీ తర్వాత అంత దూకుడుగా సెలబ్రేట్ చేసుకున్నాను. నా ఫ్రస్టేషన్ నుంచి బయటకు వచ్చాను. మంచి స్కోరు చేయడం వల్ల మంచి ఫీలింగ్ అనిపించింది.' అని డికాక్ మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.

బౌండరీల ద్వారానే సెంచరీ పరుగులు
ఇకపోతే లక్నో బ్యాటర్లలో ఓపెనర్లు కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ ఇద్దరే 20ఓవర్లు ఆడి 210పరుగుల భారీ స్కోరు చేశారు. కేకేఆర్ ముందు భారీ టార్గెట్ ఉంచారు. డి కాక్ అజేయంగా (70బంతుల్లో 140నాటౌట్ 10 ఫోర్లు, 10సిక్సర్లు)తో సునామీ రేపడంతో స్కోరు బోర్డు ఉరకలెత్తింది. బౌండరీల ద్వారానే సెంచరీ (100పరుగులు) డికాక్ పిండుకున్నాడు. ఇకపోతే కెప్టెన్ కేఎల్ రాహుల్ డికాక్ చెలరేగుతుంటే మంచి భాగస్వామ్యాన్ని అందించాడు. ఇకపోతే ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు వీరోచితంగా పోరాడారు. చివరి బంతికి 2పరుగుల తేడాతో కేకేఆర్ ఓటమి పాలయింది.
|
నిజంగా వాళ్లు ఖతర్నాక్ ఆడారు
ఇంత భారీ స్కోరు చేసినప్పటికీ మ్యాచ్ ఇంత టఫ్ వస్తుందని భావించారా అని డికాక్‌ను కామెంటేటర్ ప్రశ్నించగా అతను బదులిస్తూ.. 'నిజాయితీగా చెప్పాలంటే కేకేఆర్ వాళ్లు ఖతర్నాక్ ఆడారు. పరిస్థితులను సరిగ్గా అంచనా వేశారు. మా బౌలర్లపై బీభత్సమైన అటాక్ చేశారు. ఇక చివరి ఓవర్లో మార్కస్ స్టోయినిస్ 21పరుగులను ఈజీగా డిఫెండ్ చేస్తానడి అనుకున్నాను. కానీ మొదటి మూడు బంతుల్లో బౌండరీలు రావడంతో మా పనైపోయిందని ఫిక్సయ్యా. కానీ లూయిస్ పట్టిన క్యాచ్ మళ్లీ మ్యాచ్ మా వైపు టర్న్ అయ్యేలా చేసింది. దీన్ని బట్టి మంచి క్యాచ్‌లు గెలిపిస్తాయి మ్యాచ్‌లు అని అర్థమైంది.

ఆ ఓవర్లో ఓ రేంజ్ థ్రిల్లింగ్
కేకేఆర్ వర్సెస్ లక్నో చివరి ఓవర్లో ఓ రేంజ్లో థ్రిల్లింగ్ వచ్చింది. 21పరుగులు చేయాల్సిన పరిస్థితిలో రింకూ సింగ్ ఆకాశమే మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో వరుసగా 4, 6, 6, బాదాడు. దీంతో 3బంతుల్లో 5పరుగులు చేయాల్సిన పరిస్థితుల్లో రింకూ రెండు రన్స్ తీశాడు. తర్వాత బంతికి ఈవెన్ లూయిస్ ఒక్క చేతితో పట్టిన అద్భుతమైన క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చింది. రింకూ ఔటయిపోగా చివరకు ఉమేష్ యాదవ్ క్రీజులోకి రాగా స్టోయినిస్ అతన్ని బౌల్డ్ చేశాడు. దీంతో రెండు పరుగుల తేడాతో కోల్‌కతా ఓటమిపాలయింది. దీంతో కేకేఆర్ ప్లేఆఫ్ రేసు నుంచి అధికారికంగా తప్పుకోగా.. లక్నో 18పాయింట్లతో ప్లేఆఫ్ రేసుకు చేరుకుంది.