Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ కంటే వేగంగా డీ కాక్: పిన్నవయసులో 10 సెంచరీలు

ప్రచంచ క్రికెట్‌లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డులను అధిగమించే సత్తా ఉన్న క్రికెటర్ ఎవరైనా ఉన్నారా? అన్న ప్రశ్నకు భారతీయలు నోట వినిపించే పేరు విరాట్ కోహ్లీ. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీనే మరిపిస్తున్నాడు దక్షిణాఫ్రికాకు ఓపెన్ డీ కాక్.

చక్కని ఆటతీరుతో ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో సెంచరీ సాధించిన డీ కాక్ అరుదైన రికార్డు సృష్టించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా పది సెంచరీలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 55 వన్డే మ్యాచ్‌ల్లో ఐదు అర్ధ సెంచరీలతో పాటు 10 సెంచరీలు సాధించాడు.

అంతేకాదు ఇంగ్లాండ్‌పై సెంచరీ సాధించడంతో పిన్న వయసులో 10 సెంచరీలు సాధించిన ఆటాగాడిగా కూడా గుర్తింపు పొందాడు. డీకాక్ 23 సంవత్సరాల 54 రోజుల వయసులో 10 సెంచరీలు చేస్తే, అదే విరాట్ కోహ్లీ 10 సెంచరీలు చేసే సమయానికి 23 సంవత్సరాల 159 రోజులు.

Quinton de Kock Betters Virat Kohli, Becomes Youngest to 10 ODI Centuries

మరోవైపు టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి తొలి పది సెంచరీలు చేయడానికి 80 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. అదే డీ కాక్ మాత్రం కేవలం 55 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డుని సాధించాడు. కోహ్లీ ఆట వేగంతో పోలిస్తే, డీకాక్ వేగం మెరుగ్గా ఉందనే విషయాన్ని కూడా తెలియజేస్తోంది.

దక్షిణాఫ్రికా జట్టు తరుపున వన్డేల్లో 10 సెంచరీలు సాధించిన ఏడో ఆటగాడిగా డీ కాక్. ఇదిలా ఉంటే తన సహచర ఆటగాడు, దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ హషీమ్ ఆమ్లా రికార్డును కూడా డీకాక్ అధిగమించాడు. ఆమ్లా 57 ఇన్నింగ్స్‌లలో నెలకొల్పిన 10 సెంచరీల రికార్డును అధిగమించాడు.

దక్షిణాఫ్రికా జట్టులో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఏబీ డివియర్స్ ఉన్నాడు. 193 మ్యాచ్‌‌ల్లో 23 సెంచరీలు సాధించాడు. ఆ తర్వాతి స్థానాల్లో హషీమ్ ఆమ్లా, గిబ్స్, కల్లిస్, గ్యారీ కిరెస్టన్, గ్రేమ్ స్మిత్‌లు ఉన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+