Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Quinton de Kock: టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన స్టార్ వికెట్ కీప‌ర్

Quinton de kock Announced the Retirement from Test Cricket.
Quinton De Kock Retirement : Why So Early ? | Oneindia Telugu

సౌతాఫ్రికా స్టార్ క్రికెట‌ర్ క్వింటన్ డికాక్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. టెస్టు క్రికెట్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. 29 ఏళ్ల డికాక్ సెంచూరియ‌న్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా చేతిలో సౌతాఫ్రికా ఓడిన కొన్ని గంటల్లోనే రిటైర్మెంట్ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మనార్హం. ఈ నిర్ణ‌యాన్ని డికాక్ త‌ర‌ఫుప సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారికంగా ప్ర‌క‌టించింది. 8 ఏళ్లపాటు సౌతాఫ్రికా జ‌ట్టుకు వికెట్ కీప‌ర్‌గా సేవ‌లు అందించిన డికాక్ టెస్టుల నుంచి త‌ప్పుకున్న‌ప్ప‌టికీ ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌లో కొన‌సాగ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. మొద‌ట్లో భార‌త్‌తో జ‌రిగే రెండు, మూడు టెస్టుల‌కు భార్య డెలివ‌రీ కార‌ణంగా డికాక్ దూర‌మ‌వుతాడని క్రికెట్ సౌతాఫ్రికా ప్ర‌క‌టించింది. కానీ తాజాగా ఏకంగా రిటైర్మెంట్ నిర్ణ‌యం తీసుకోని డికాక్ అభిమానుల‌తోపాటు తోటి ఆట‌గాళ్ల‌కు షాకిచ్చాడు.

రిటైర్మెంట్‌కు గ‌ల కార‌ణం
రిటైర్మెంట్ ప్ర‌క‌ట‌న అనంత‌రం డికాక్ త‌న వీడ్కోలుకు గ‌ల కార‌ణాన్ని వివ‌రించాడు. నిజానికి త‌నకు టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్ట‌మ‌ని చెప్పిన డికాక్‌.. త‌న దేశం త‌రఫున ప్రాతినిధ్యం వ‌హించ‌డానికి ఇష్ట‌ప‌డాతాన‌ని వెల్ల‌డించాడు. త‌న క్రికెట్ జీవితంలో ఎన్నో ఎత్తుప‌ల్లాల‌ను చూశాన‌ని, ఇప్పుడు మ‌రో జీవితాన్ని చూడ‌నున్నాన‌ని తెలిపాడు. అయితే రిటైర్మెంట్ నిర్ణ‌యం చాలా ఆలోచించే తీసుకున్నాన‌ని, ఇది అంత తేలిక‌గా తీసుకున్న నిర్ణ‌యం కాద‌ని డికాక్ చెప్పాడు. త‌న భార్య త్వ‌ర‌లో మొద‌టి సారి డెలివ‌రీ కాబోతున్న నేప‌థ్యంలో, భ‌విష్య‌త్ గురించి ఆలోచించి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపాడు. డెలివరీ స‌మ‌యంలో త‌న కుటుంబానికి ఎక్కువ స‌మ‌యం కేటాయించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని, త‌న‌కు త‌న కుటుంబ‌మే స‌ర్వ‌స్వ‌మ‌ని చెప్పుకొచ్చాడు. ఇక త‌న టెస్టు క్రికెట్‌లో త‌న‌తో ప్ర‌యాణించిన‌, త‌న‌కు స‌హ‌కరించిన ప్ర‌తి ఒక్క‌రికీ డికాక్ ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలిపాడు.

డికాక్ టెస్టు కెరీర్‌
2014 ఫిబ్ర‌వ‌రి 20న ఆస్ట్రేలియాతో జ‌రిగిన టెస్టు మ్యాచ్ ద్వారా క్వింట‌న్ డికాక్ అంత‌ర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. వికెట్ కీప‌ర్‌గా, బ్యాట‌ర్‌గా సౌతాఫ్రికా జ‌ట్టులో కీల‌క ఆట‌గాడిగా కొనసాగాడు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టివ‌రకు 54 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 91 ఇన్నింగ్స్‌ల్లో 38 స‌గ‌టుతో 3,300 ప‌రుగులు చేశాడు. ఇందులో 6 సెంచ‌రీలు, 22 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఏకంగా 70 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయ‌డం విశేషం. అత్య‌ధిక స్కోర్ 141 ప‌రుగులు. మొత్తం 411 ఫోర్లు, 33 సిక్సులు కొట్టాడు. వికెట్ కీప‌ర్‌గా 54 టెస్టు మ్యాచ్‌ల్లో డికాక్ 232 మంది బ్యాట‌ర్లను ఔట్ చేశాడు. ఇందులో 221 మందిని క్యాచ్‌ల ద్వారా ఔట్ చేయ‌గా.. 11 మందిని స్టంపింగ్ ద్వారా ఔట్ చేశాడు. కాగా డికాక్‌ చివ‌రి టెస్టు మ్యాచ్ ఇటీవ‌ల భార‌త్‌తో ముగిసిన సెంచూరియ‌న్‌దేనన్న విష‌యం తెలిసిందే. చివ‌రి మ్యాచ్‌లో ఫ‌స్ట్ ఇన్నింగ్స్‌లో 34, సెకండ్ ఇన్నింగ్స్‌లో 21 ప‌రుగులు చేశాడు.

Story first published: Friday, December 31, 2021, 9:59 [IST]
Other articles published on Dec 31, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+