Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli : ఇంగ్లిష్ పరీక్షలో కోహ్లీపై ప్రశ్న.. వైరల్ అవుతున్న క్వశ్చన్ పేపర్!

Question on Virat Kohli comeback century goes viral

టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ చాలా కాలంగా ఫామ్‌లో లేక తంటాలు పడిన సంగతి తెలిసిందే. అయితే నెలరోజులపైగా పూర్తిగా విశ్రాంతి తీసుకున్న అతను.. ఆ తర్వాత మళ్లీ తన పూర్వ వైభవం దిశగా సాగుతున్నాడు. గతేడాది జరిగిన ఆసియా కప్‌లో వరుసగా హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్న అతను.. అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. తద్వారా మూడేళ్లకుపైగా సెంచరీలు చేయడం లేదనే బాధకు తెరదించాడు. ఇది అతని అంతర్జాతీయ కెరీర్‌లో 71వ సెంచరీ కావడం గమనార్హం.

ముఖ్యంగా టీ20ల్లో కోహ్లీకి ఇదే తొలి శతకం. ఇది చూసిన చాలా మంది నిపుణులు.. పట్టుదల, అలుపెరగని పోరాటం వల్లనే కోహ్లీ మళ్లీ తన ఫామ్ అందుకున్నాడని కొనియాడారు. ఇలా కోహ్లీ పునరాగమనాన్ని ఘనంగా చాటుకోవడం ఎంతో మంది యువ ఆటగాళ్లకు కచ్చితంగా స్ఫూర్తిగా నిలుస్తుందని మెచ్చుకున్నారు. ఒక స్కూల్ కూడా ఇలాగే కోహ్లీ పునరాగమనం చాలా స్ఫూర్తిదాయకం అని భావించింది. అందుకే తమ స్కూల్‌లో 9వ తరగతి చదివే విద్యార్థులకు కోహ్లీ పునరాగమనం గురించి వివరించాలని క్వశ్చన్ వేసింది.

ఇంగ్లిష్‌లో ఉన్న సదరు క్వశ్చన్ పేపర్‌ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దానిలో 71వ సెంచరీని సెలబ్రేట్ చేసుకుంటున్న కోహ్లీ ఫొటో ఉంది. ఈ ఫొటో గురించి వంద లేదా 120 పదాల్లో తమ అభిప్రాయం తెలియజేయాలనేదే ప్రశ్న. దీన్ని సోషల్ మీడియాలో పంచుకోగా టీమిండియా అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తామైతే ఈ ప్రశ్నకు ఎలా సమాధానాలు రాస్తామో వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు.

ముఖ్యంగా విరాట్ కోహ్లీ అభిమానులైతే ఈ ప్రశ్నాపత్రం ఫొటోలు చూసి తెగ సంతోషిస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్ ఇలా విద్యార్థులకు కూడా స్ఫూర్తిగా మారాడని సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా పరీక్ష పేపర్ సెట్ చేసే వాళ్లు తమకు కూడా కావాలని కొందరు అంటున్నారు. మరికొందరేమో తమను ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడగడం లేదు? అని క్వశ్చన్ చేస్తున్నారు. ఏదేమైనా కోహ్లీ అభిమానులు మాత్రం నెట్టింట ఈ ఫొటోను తెగ వైరల్ చేస్తున్నారు.

Story first published: Saturday, March 25, 2023, 16:41 [IST]
Other articles published on Mar 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+