సన్‌రైజర్స్ ఓడినా.. ఐపీఎల్ ఫైనల్‌కు వెళ్లింది కూడా మన తెలుగు జట్టే!!

అబుదాబి: బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలిసారి ఐపీఎల్ ఫైనల్ చేరింది. మొదట బ్యాటింగ్‌లో దంచికొట్టిన అయ్యర్ సేన.. ఆ తరువాత బౌలింగ్‌లోనూ విజృంభించడంతో ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో 17 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో పుష్కర కాలంగా కప్ కోసం ప్రయత్నిస్తున్న ఢిల్లీ ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఆఖరి పోరుకు అర్హత సాధించింది. గతేడాది ఎలిమినేటర్‌లో ఢిల్లీ చేతిలో ఓడిన తెలుగు రాష్ట్రాల అభిమాన జట్టు సన్‌రైజర్స్ .. ఈ సారి క్వాలిఫయర్-2లో ఓడి ఇంటిబాట పట్టింది.

50 శాతం జీఎంఆర్‌కు:
క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడిందని తెలుగు అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఫైనల్లో అడుగుపెట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మన తెలుగు వాళ్లకు చెందిన జట్టే. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంఛైజీ ఓనర్ జీఎంఆర్ గ్రూప్ అన్న సంగతి తెలిసిందే. ఆ సంస్థకు గ్రంధి మల్లికార్జున రావు ఓనర్. ఢిల్లీ ఫ్రాంఛైజీలో ఈ సంస్థకు 50 శాతం స్టేక్ ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన గ్రంధి మల్లికార్జున రావుకు చెందిన సంస్థే జీఎంఆర్. ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లాలోని రాజాం. మిగిలిన 50 శాతం జెఎస్‌డబ్ల్యూ సంస్థకు ఉంది. 2008లో జీఎంఆర్.. ఢిల్లీ డేర్ డెవిల్స్‌ను కనుగోలు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌గా మారిందా జట్టు పేరు. 2018లో 50 శాతం వాటాను జెఎస్‌డబ్ల్యూకు విక్రయించారు. అప్పుడే పేరును మార్చేశారు.

2018లో కొనుగోలు:
84 మిలియన్ డాలర్ల పెట్టుబడితో జీఎంఆర్ సంస్థ 2008లో ఢిల్లీ కేపిటల్స్‌ను కొనుగోలు చేసింది. ఐపీఎల్ ఫ్రాంఛైజీల్లో నాలుగో అత్యంత ఖరీదైన జట్టుగా పేరుంది. ముంబై ఇండియన్స్ 111.9, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 111.9, చెన్నై సూపర్ కింగ్స్ 91 మిలియన్ డాలర్ల పెట్టుబడి ఉంది. 2018లో 50 స్టేక్‌ను జెఎస్‌డబ్ల్యూకు విక్రయించారు. అప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మారింది. జీఎంఆర్ సంస్థ ప్రొ కబడ్డీ లీగ్ టీమ్‌ను కూడా కొనుగోలు చేసింది. యూపీ యోధ జట్టు జీఎంఆర్‌దే. ఢిల్లీ కేపిటల్స్ బ్రాండ్ వ్యాల్యూ 374 కోట్లు.

కేన్ ఒంటరి పోరాటం:
క్వాలిఫయర్-2లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగులు చేసింది. శిఖర్ ధవన్ (50 బంతుల్లో 78; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) గర్జించగా.. షిమ్రన్ హెట్‌మైర్ (22 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, ఒక సిక్సర్), మార్కస్ స్టొయినిస్ (38; 5 ఫోర్లు, ఒక సిక్సర్) మెరుపులు మెరిపించారు. అనంతరం ఛేజింగ్‌లో హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (45 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. 4 వికెట్లు తీసిన ఢిల్లీ బౌలర్ కాగిసో రబాడ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications