Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MI vs DC: ఈసారి కూడా కప్పు మాదే: ముంబై స్టార్ ప్లేయర్

Qualifier 1, MI vs DC: Hardik Pandya says Mumbai Indians can win the IPL 2020 cup

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 టైటిల్ తమదే అని ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు తమ ఆటగాళ్లు బాగా ఆడారని, ఇంతకుమించి ఎక్కువ ఆశించలేమన్నాడు. ప్రతీ సంవత్సరం టీ20 లీగ్‌లో తాము నెమ్మదిగా విజయాల బాట పడుతున్నా ఈసారి విశేషంగా రాణించామని హార్దిక్‌ చెప్పాడు. ఐపీఎల్ చరిత్రలో ముంబై జట్టు అత్యధికంగా నాలుగు సార్లు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలోనే నాలుగు కప్పులు అందుకుంది.

మేం కప్పు సాధిస్తాం

మేం కప్పు సాధిస్తాం

తాజాగా ముంబై ఇండియన్స్ ట్విటర్‌ వేదికగా ఓ వీడియో పంచుకోగా.. అందులో హార్దిక్‌ పాండ్యా మాట్లాడాడు. 'ఐపీఎల్ 2020 ఇప్పటివరకు అంతా బాగా సాగింది. మా జట్టు ఆటగాళ్లు ప్రతీ ఒక్కరు అవసరమైన వేళ రాణిస్తున్నారు. దాంతో మాకు అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయి. మా ఆటగాళ్లు బాగా ఆడారు, ఇంతకుమించి ఎక్కువ ఆశించలేం. ఇక ఇప్పుడు అసలైన పోరుకు సమయం ఆసన్నమైంది. కీలక దశకు చేరుకున్నాం. మేం కప్పు సాధించే అవకాశం ఉందని భావిస్తున్నా' అని హార్దిక్‌ తెలిపాడు.

బ్యాటింగ్‌పై దృష్టిపెట్టా

బ్యాటింగ్‌పై దృష్టిపెట్టా

'నా బ్యాటింగ్‌పై పూర్తిగా దృష్టిపెట్టా. సాధన కూడా బాగా జరుగుతోంది. ఇది నాకో అవకాశం. నేను బరిలోకి దిగేటప్పుడు జట్టు ఏం ఆశిస్తుందో అదే ప్రాధాన్యం' అని హార్దిక్‌ పాండ్యా పేర్కొన్నాడు. రోహిత్‌ శర్మ నేతృత్వంలో ముంబై ఇండియన్స్ ఇప్పటికే నాలుగుసార్లు టైటిల్‌ ఎగరేసుకుపోయింది. దీంతో ఈ లీగ్‌లో ముంబై అత్యంత ప్రభావవంతమైన జట్టుగా కొనసాగుతోంది. ప్రస్తుత ముంబై జోరు చూస్తుంటే.. హార్దిక్‌ చెప్పిందే నిజమయ్యేలా ఉంది. మరి హార్దిక్ జోస్యం ఫలిస్తుందో లేదో చూడాలి.

ఫైనల్ చేరడమే లక్ష్యంగా

ఫైనల్ చేరడమే లక్ష్యంగా

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్‌.. తొలి టైటిల్‌ కోసం ఆరాటపడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ తుది పోరుకు నేరుగా చేరడమే లక్ష్యంగా తలపడేందుకు సిద్ధమయ్యాయి. గురువారం దుబాయ్‌ అంతర్జాతీయ మైదానం వేదికగా ఐపీఎల్‌ 13వ సీజన్‌ తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ ఇరు జట్ల మధ్య జరుగనుంది. వరుసగా నాలుగు ఓటములు చవిచూసినా లీగ్ ‌దశ చివరి మ్యాచ్‌లో బెంగళూరుపై గెలిచి ఢిల్లీ మళ్లీ పుంజుకోగా.. టాప్‌లో ఉన్న ముంబై గత మ్యాచ్‌లో హైదరాబాద్‌ చేతిలో ఘోరంగా ఓడింది. క్వాలిఫయర్‌-1లో ఓడిన జట్టుకు ఫైనల్‌ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్‌ విజేతతో జరిగే క్వాలిఫయర్‌-2లో గెలిస్తే తుది పోరుకు చేరవచ్చు.

పటిష్టంగా ముంబై

పటిష్టంగా ముంబై

గాయం కారణంగా నాలుగు మ్యాచ్‌లకు దూరమైన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మళ్లీ జట్టులోకి రావడం ముంబైకి పెద్ద బలం. గత మ్యాచ్‌లో రోహిత్‌ విఫలమైనా.. ఒక్కసారి గాడిలోకి పడితే అతడి జోరుకు తిరుగుండదు. ఇషాన్‌ కిషన్‌, క్వింటన్ డికాక్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. హార్దిక్‌ పాండ్యా, కీరన్‌ పొలార్డ్‌ బిగ్‌ హిట్టింగ్‌ చేయగలరు. ఇక బౌలింగ్‌లో ముంబై మరింత బలంగా ఉంది. జస్ప్రీత్ ‌ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. స్పిన్నర్లు రాహుల్‌ చహర్‌, కృనాల్‌ పాండ్యా తకూడా మెరుస్తున్నారు. ఢిల్లీ కంటే ముంబై పటిష్టంగా ఉంది.

Story first published: Thursday, November 5, 2020, 15:06 [IST]
Other articles published on Nov 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+