
కోల్‌కత: ఐపీఎల్ 2022 సీజన్ తొలి క్వాలిఫయర్‌లో ఉత్కంఠభరితంగా ముగిసింది. గుజరాత్ టైటాన్స్ తన జైత్రయాత్రను ప్లేఆఫ్స్‌లో కూడా కొనసాగిస్తోంది. చేస్తోంది. లీగ్ దశలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఈ జట్టు- అదే దూకుడుతో ఫైనల్స్‌కు చేరింది. కోల్‌కత ఈడెన్ గార్డెన్స్‌లో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ సీజన్ ఫైనల్స్ చేరిన తొలి జట్టుగా ఆవిర్భవించింది.
ఐపీఎల్ ప్రస్థానాన్ని ప్రారంభించిన తొలి సీజన్‌లోనే ఫైనల్స్ చేరిన జట్టుగా చరిత్ర సృష్టించింది. తొలి సీజన్‌లోనే జట్టును ఫైనల్స్‌కు చేర్చిన మొనగాడిగా పేరు తెచ్చుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్ ఎప్పట్లాగే చెలరేగిపోయాడు. 56 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. చివరి ఓవర్‌లో నో బాల్‌కు రనౌట్‌గా వెనుదిరిగాడు. కేప్టెన్ సంజూ శాంసన్-47, దేవ్‌దత్ పడిక్కల్-28 రాణించారు.

గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ, యశ్ దయాళ్, సాయి కిషోర్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టారు. ఈ భారీ స్కోర్‌ను కూడా కాపాడుకోలేకపోయింది రాజస్థాన్ రాయల్స్. అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ టైటాన్స్ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 191 పరుగులు చేసింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ వృద్ధిమాన్ సాహా వికెట్‌ను కోల్పోయినప్పటికీ.. ఎక్కడా తొట్రుపడలేదు. బ్యాటర్లందరూ సమష్టిగా సత్తా చాటారు.
మాథ్యూవేడ్-35, శుభ్‌మన్ గిల్-35, హార్దిక్ పాండ్యా-40, డేవిడ్ మిల్లర్-68.. జట్టు విజయానికి అవసరమైన పరుగులను ఇంకా మూడు బంతులు మిగిలివుండగానే సాధించారు. ఈ విజయంతో ఐపీఎల్ ఫైనల్స్‌లో ఎంట్రీ ఇచ్చింది గుజరాత్ టైటాన్స్. ఈ విజయం సాధించిన అనంతరం కేప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడారు. తాను గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నానని, నిద్రలేని రాత్రులను గడిపానని వ్యాఖ్యానించాడు.
బయో బబుల్ జీవితాన్ని గడిపే సమయంలో శారీరకంగా అలసటకు గురయ్యానని పేర్కొన్నాడు. తన భార్య, కుమారుడు, సోదరుడు- తాను మళ్లీ మామూలు జీవితాన్ని గడపడంలో కీలక పాత్ర పోషించారని చెప్పాడు. తొలి సీజన్‌లోనే జట్టు ఫైనల్స్‌కు చేరినా తాను ఎలాంటి భావోద్వేగాలకు గురి కావట్లేదని అన్నాడు. తటస్థంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నానని వ్యాఖ్యానించాడు. తన జట్టులో ఉన్న 23 మంది ప్లేయర్లు- జట్టు విజయానికి కారకులేనని, అందుకు గర్విస్తున్నానని హార్దిక్ పాండ్యా అన్నాడు.
డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్.. ఇతర విదేశీ ప్లేయర్లతో డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం ఓ గొప్ప అనుభూతిని ఇచ్చిందని హార్దిక్ పాండ్యా చెప్పాడు. ఐపీఎల్ సీజన్ మొత్తానికీ రషీద్ ఖాన్ అద్భుతంగా రాణించాడని, డేవిడ్ మిల్లర్ మరింత గొప్పగా ఆడాడనీ ప్రశంసించాడు. జట్టుకు అవసరమైన ప్రతీసారీ తాను ఓ ప్లేయర్‌గా ఆడానని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్ ఛాంపియన్‌గా నిలవాలనేది తన కల అని, దాన్ని సాకారం చేసుకోవడానికి శ్రమిస్తామని అన్నాడు. ఐపీఎల్‌లో నాలుగు సార్లు ఫైనల్స్ ఆడిన అనుభవం తనకు ఉందని హార్దిక్ పాండ్యా గుర్తు చేశాడు.