లాహోర్: పాకిస్తానీ హాట్ మోడల్ కందీల్ బాలోచ్ మరోసారి ఓ వీడియోను విడుదల చేసింది. అంతకుముందు భారత్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కోసం వీడియో విడుదల చేసింది. ఈసారీ బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కోసం ఆమె ఓ వీడియో విడుదల చేసింది.
ఇప్పుడు ఐపీఎల్ మ్యాచులు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్ మ్యాచులలో కోల్‌కతా నైట్ రైడర్స్ గెలుపొందాలని కోరుకుంటూ ఆమె వీడియో విడుదల చేసింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు షారుక్ ఖాన్‌ది. ఐపీఎల్లో షారుక్ టీం అయిన కోల్‌కతా గెలిస్తే నేను నా స్టయిల్లో సెలబ్రేట్ చేసుకుంటానని చెప్పింది.
'బాలీవుడ్ కింగ్ ఖాన్‌కు నా ప్రత్యేకమైన సందేశం. ఐపీఎల్లో మీ జట్టు గెలిస్తే నేను అనగా.. కందీల్ బాలోచ్‌ను తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకుంటా. ఇది అందరిని అలరిస్తుంది' అని కందీల్ బాలోచ్ మత్తుగా పేర్కొంది. అంటే ఆమె ఉద్దేశ్యం మరోసారి దుస్తులు విప్పే అవకాశం ఉంటుందని అభిమానులు ఆశించే ఛాన్సు ఉంది.