ముంబై: ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నీలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అనంతరం తన అంద చందాలతో కూడిన వీడియోని విడుదల చేసిన వార్తల్లో నిలిచిన పాకిస్థాన్ మోడల్ కండీల్ బలోచ్ తాజాగా ఆదివారం మరో వీడియోను తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది.

ఈ వీడియోకి ఒక ప్రత్యేకత ఉంది. మొన్నటి వరకు పాకిస్థాన్ ఆటగాడు షాహిది అఫ్రిదిని టార్గెట్ చేసిన ఈ అమ్మడు, ఈ సారి టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై దృష్టి సారించింది. ఆదివారం తాను పోస్టు చేసిన వీడియోలో అనుష్క శర్మను గురించి ఆలోచించడం మానివేయాలని కోహ్లీకి సలహా కూడా ఇచ్చింది.
'నీతో డేటింగ్ చేయాలని ఉంది' అని తన మనసులోని కోరికను చెప్పుకుంది. మాజీ ప్రేయసి అనుష్క శర్మ గురించి ఆలోచించడం మానేసి, తన గురించి సీరియస్‌గా ఆలోచించాలని హస్కీ వాయిస్‌తో కోరుకుంది. చివరగా 'విరాట్ ఐ లవ్యూ బేబీ... ప్లీజ్ ప్లీజ్...' అంటూ హొయలు పోతూ, వీడియోలో చివరిగా కోహ్లీకి ఓ ముద్దు కూడా ఇచ్చింది.
ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే నగ్నంగా డ్యాన్స్ చేస్తానని ప్రకటించి పెద్ద సంచలనానికి తెరలేపింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోగానే అఫ్రీదీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. అదే విధంగా పాక్ ఓటమి పాలైతే బికినీలో డ్యాన్స్ చెప్పింది. తాను చెప్పినట్లుగానే పాకిస్థాన్ ఓటిమి పాలైనందుకు బికినీలో డ్యాన్స్ చేస్తూ ఉన్న వీడియోని పోస్టు చేసి అభిమానులకు కనువిందు చేసింది.
ఆ తర్వాత 'అఫ్రీదీ బేబీ నువ్వే నా లవర్' అంటూ ఓ సెల్ఫీ వీడియోని నెట్‌లో పెట్టి రెచ్చిపోయిన ఈ మోడల్ ఇప్పుడు విరాట్ కోహ్లీ కావాలంటోంది. కోహ్లీని లవ్ చేస్తున్నానంటూ ట్వీట్ చేసింది. ఈ లవ్ ప్రపోజల్‌లో బలోచ్ కాస్తంత వెటకారాన్ని జోడించింది. ఆ వెటకారం ఏంటంటే తాను కోహ్లీని ప్రేమిస్తున్నానంటూనే... అనుష్క శర్మ పేరును ప్రస్తావిస్తూ ట్వీట్ చేసింది.