కోహ్లీ, సానియాకు చాలెంజ్ విసిరిన పీవీ సింధు!!

హైదరాబాద్: భారత దేశంలో మహమ్మారి కరోనా (కొవిడ్ 19) వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 128 కరోనా కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతువాత పడ్డారు. దీంతో దేశంలోని సెలెబ్రిటీలు ప్రజలకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరికొందరు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకొచ్చిన 'సేఫ్ హ్యాండ్స్' చాలెంజ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

క్యాథరిన్ చాలెంజ్‌ను స్వీకరించిన సింధు:
'సేఫ్ హ్యాండ్స్' చాలెంజ్‌లో భాగంగా.. ఇప్పటికే దేశంలోని పలువురు ప్రముఖులు తమ చేతులను శుభ్రపరుచుకుంటున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇతరులను కూడా దీనిని స్వీకరించాలని కోరుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ క్యాథరిన్ హడ్డా విసిరిన సేఫ్ హ్యాండ్స్ చాలెంజ్‌ను భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు స్వీకరించారు. చాలెంజ్‌లో భాగంగా తన చేతులను శుభ్రం చేసుకుంటున్న వీడియోను సింధు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. దాదాపు 30 సెకండ్లు సింధు చేతులు శుభ్రం చేసుకుంది.
కోహ్లీ, సానియాకు చాలెంజ్:
ఈ సందర్భంగా క్యాథరిన్ హడ్డాకు సింధు ధన్యవాదాలు తెలిపారు. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు మనం అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు తమ చేతులను శుభ్రపరుచుకోవాలన్నారు. ఇక కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు, టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలు ఈ చాలెంజ్‌ను స్వీకరించాలని కోరారు. మరి ఈ ముగ్గురిలో ఎవరు ముందుగా చాలెంజ్‌ను స్వీకరిస్తారో చూడాలి.

ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో సింధు ఓటమి:
ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో సింధు ఓడిపోయిన విషయం తెలిసిందే. దీంతో టైటిల్ మరోసారి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. భారీ అంచనాలతో బరిలో దిగిన సింధుకు 8వ సారి కూడా నిరాశ తప్పలేదు. గత శుక్రవారం హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ సింధు 21-12, 15-21, 13-21తో నాలుగో సీడ్ నొజొమి ఒకుహర (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. 68 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సింధు తొలి గేమ్‌లో ప్రదర్శించిన దూకుడు రెండు, మూడు గేమ్‌ల్లో కనబరచలేదు.

ధైర్యంగా యుద్ధం చేద్దాం:
'ప్రజలందరూ కరోనా వైరస్‌పై పోరాడేందుకు దృఢచిత్తంతో ముందుకు కదలండి. కరోనా వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాడదాం. అందరూ ముందుజాగ్రత్త చర్యలు తీసుకోండి. ముఖ్యంగా వైరస్ బారిన పడకుండా నివారణ చర్యలు తీసుకోవడమే ఉత్తమ మార్గం' అని శనివారం ట్విటర్ వేదికగా విరాట్ కోహ్లీ దేశ ప్రజలకు సూచించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications