For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సయ్యద్‌ మోడీ గ్రాండ్‌ ప్రి: సింధు ఖాతాలో మరో టైటిల్

సయ్యద్‌ మోడీ గ్రాండ్‌ ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు 21-13, 21-14 తేడాతో ఇండోనేసియాకు చెందిన గ్రెగోరియా మరిస్కపై విజయం

By Nageshwara Rao

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తన ఖాతాలో మరో టైటిల్ చేరింది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిన సయ్యద్‌ మోడీ గ్రాండ్‌ ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు చాంపియన్‌గా అవతరించింది.

ఆదివారం జరిగిన ఫైనల్లో సింధు 21-13, 21-14 తేడాతో ఇండోనేసియాకు చెందిన గ్రెగోరియా మరిస్కపై విజయం సాధించి టైటిల్‌ను సాధించింది.

PV Sindhu

ఏకపక్షంగా సాగిన ఈ పోరులో పీవీ సింధు 21-13, 21-14 స్కోరుతో వరుస సెట్లలో విజయం సాధించి తొలిసారి ఈ బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచింది. ఏ దశలోనూ సింధును నిలువరించ లేకపోయిన గ్రెగోరియా రన్నరప్‌గా నిలిచింది. ఇది సింధుకు తొలి సయ్యద్‌ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టైటిల్ కావడం విశేషం.

ఇక పురుషుల సింగిల్స్ లో భారత ఆటగాడు సమీర్ వర్మ 21-19,21-16 తేడాతో భారత్‌కు చెందిన సాయి ప్రణీత్ పై విజయం సాధించి టైటిల్‌ను సాధించాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+