Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సయ్యద్ మోడీ టోర్నీ: ప్రీ క్వార్టర్స్‌లో పీవీ సింధు

హైదరాబాద్: సయ్యద్‌ మోడీ గ్రాండ్‌ ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు ప్రీ క్వార్టర్స్‌లో ప్రవేశించింది. మరోవైపు కిదాంబి శ్రీకాంత్‌, సాయి ప్రణీతలు కూడా మూడో రౌండ్‌కు చేరారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సింధు 21-9, 21-11తో వరుస గేముల్లో అనుర ప్రభుదేశాయ్‌పై విజయం సాధించింది.

మరో మ్యాచ్‌లో శ్రీకృష్ణప్రియ 21-12, 21-5తో గౌరి అసాజిపై నెగింది. వైదేహి 21-14, 21-10తో పూజను ఓడించింది. పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌, మూడో సీడ్‌ కిదాంబి శ్రీకాంత్‌ తొలి రౌండ్లో 15-21, 21-7, 21-14తో లఖానీ సరంగ్‌పై విజయం సాధించాడు.

PV Sindhu enters pre-quarterfinals of Syed Modi event

మరో మ్యాచ్‌లో సాయి ప్రణీత 21-15, 21-10తో ఆశీష్‌ శర్మను ఓడించింది. సౌరభ్‌ వర్మ 21-6, 21-10తో శుభమ్‌ ప్రజాపతిపై విజయం సాధించాడు. హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 21-16, 21-8తో బోహిత జోషిపై, సమీర్‌ వర్మ 21-13, 21-14తో అజయ్‌పై విజయం సాధించారు.

మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కి రెడ్డి జోడీ 21-8, 21-3తో అనిస్-ప్రమద జోడీపై విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఈ టోర్నీ నుంచి డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సైనా నెహ్వాల్‌ తప్పుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+