Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వారి కోసం ప్రత్యేక వ్యూహం సిద్ధం చేసి సఫలం అయ్యాం: అంకిత్‌

Punjab vs Hyderabad: Our plans are executing well in match says Ankit Rajpoot

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టోల కోసం ప్రత్యేక వ్యూహం సిద్ధం చేసి వాటిని ఆచరణలో పెట్టాం అని కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ బౌలర్ అంకిత్‌ రాజ్‌పుత్‌ తెలిపారు. సోమవారం సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 150 పరుగులు చేసింది. అనంతరం లక్షచేధనలో పంజాబ్‌ 4 వికెట్లు కోల్పోయి ఒక బంతి మిగిలి ఉండగా విజయాన్ని అందుకుంది. అర్ధ సెంచరీ చేసిన రాహుల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అంకిత్‌ రాజ్‌పుత్‌ వికెట్ తీయకున్నా పరుగులను నియంత్రించాడు.

మ్యాచ్ అనంతరం పంజాబ్‌ బౌలర్ అంకిత్‌ రాజ్‌పుత్‌ మాట్లాడుతూ... 'బెయిర్‌ స్టో, వార్నర్‌ స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వకూడదనుకున్నాం. వారి కోసం ప్రత్యేక వ్యూహం సిద్ధం చేసాం. వాటిని సరైన మార్గంలో అమలు చేసి సఫలం అయ్యాం. బెయిర్‌ స్టోను ఆదిలోనే పెవిలియన్‌కు పంపించాం. వార్నర్‌ ఇన్నింగ్స్ చివరి వరకూ ఉన్నా కూడా.. స్వేచ్ఛగా ఆడనివ్వలేదు. దీంతో సన్‌రైజర్స్‌ భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశాం' అని అంకిత్‌ తెలిపారు.

Story first published: Tuesday, April 9, 2019, 17:24 [IST]
Other articles published on Apr 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+