For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అర్షదీప్ అమ్మగారితో మాట్లాడిన పంజాబ్ స్పోర్ట్స్ మినిస్టర్.. యావత్ భారత్ అర్షకు అండగా ఉంటుందని భరోసా

Punjab sports Minister Gurmeet singh Supported Arshdeep Singh and Talked to His Mother

ఆసియా కప్ - 2022లో సూపర్ 4ఎన్‌కౌంటర్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సింపుల్ క్యాచ్‌ను వదిలిపెట్టినందుకు భారత యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ఆన్‌లైన్లో కొందరు నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేశారు. కొందరు హద్దు మీరి జాత్యాహంకార దూషణలు చేశారు. 18వ ఓవర్లో రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఆసిఫ్ అలీ క్యాచ్‌ను అర్ష్‌దీప్ జారవిడిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అసిఫ్ అలీ ఎనిమిది బంతుల్లో 16పరుగులు చేసి పాకిస్థాన్‌ను ఐదు వికెట్ల తేడాతో మ్యాచ్‌ని గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో అర్షదీప్ మిస్ చేసిన క్యాచ్ చాలా కాస్ట్‌లీగా మారింది. దీంతో కొందరు నెటిజన్లు అర్షదీప్ మీద వివక్షపూరిత ట్రోల్స్ చేశారు. ఈ క్రమంలో అతని కోచ్, ఫ్యామిలీ ఇతర సన్నిహితులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయమై పంజాబ్ క్రీడా మంత్రి గుర్మీత్ సింగ్ మీట్ హేయర్ స్పందించాడు. అర్ష్‌దీప్‌కు మద్దతుగా నిలిచారు. అతను అర్షదీప్ తల్లితో టెలిఫోనిక్ సంభాషణ చేశాడు. దేశం మొత్తం మీ కుమారుడికి అండగా నిలుస్తుందని ఆమెకు హామీ ఇచ్చాడు. ఎన్నడూ ఆట కూడా ఆడని వ్యక్తులు కూడా అర్షదీప్‌ను ఎగతాళి చేస్తున్నారని వారి గురించి అసలే పట్టించుకోవద్దంటూ అర్ష తల్లికి ఆయన చెప్పాడు. మ్యాచ్ చివరి ఓవర్ బౌలింగ్ చేసే బాధ్యతను అర్షదీప్‌కు అప్పగించగా దాదాపు తీవ్ర ఉత్కంఠకు తీసుకొచ్చాడని అతని అపారమైన ప్రతిభను మెచ్చుకోవాల్సిందేనంటూ ప్రశంసించాడు.

'మీరు ఏమాత్రం బాధపడకూడదు. అర్ష ప్రతిభ పట్ల గర్వపడాలి. పంజాబ్‌తో పాటు భారత్ మొత్తం ఈరోజు అర్ష్‌దీప్‌కు అండగా నిలుస్తోంది. ఇప్పటి వరకు క్రికెట్ ఆడని వారు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అతను 140కోట్ల మంది భారతీయుల ఆశలను మోసుకొచ్చాడు. చివరి ఓవర్ బౌలింగ్ చేయించేందుకు అర్ష్‌దీప్‌పై కెప్టెన్ విశ్వాసం చూపించాడు. దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అర్ష్‌దీప్ ప్రతిభ ఏంటనేది. ఇండియా ఆసియా కప్ గెలిచిన తర్వాత ఆటగాడికి వెల్ కమ్ చెప్పడానికి ఎయిర్‌పోర్ట్‌కి మీతో పాటు వస్తాను. వైఫల్యాలు ఆటలో భాగమని, వాటి నుంచి నేర్చుకుంటూ ముందుకు పోవాలని' అర్ష్‌దీప్ తల్లికి హేయర్ చెప్పాడు.

Story first published: Tuesday, September 6, 2022, 8:50 [IST]
Other articles published on Sep 6, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+