కోహ్లీనే మా బ్రాండ్ అంబాసిడర్: అసత్య కథనాలపై పీఎన్‌బీ వివరణ

హైదరాబాద్: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)లో రూ.11,400 కోట్ల కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో ఆ బ్యాంక్ అంబాసిడర్‌గా ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పుకోనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను ఖండిస్తూ పీఎన్‌బీ ఓ ప్రకటన విడుదల చేసింది.
'పంజాబ్ నేషనల్ బ్యాంకుతో ఉన్న ఒప్పందాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రద్దు చేసుకోబోతున్నట్లు వార్తాకథనాలు వస్తున్నాయి. అలాంటిదేమీ లేద, అవన్నీ వదంతులు మాత్రమే. విరాట్ కోహ్లీనే మా బ్రాండ్ అంబాసిడర్ అందులో ఎలాంటి మార్పు లేదు' అని ఆ ప్రకటనలో పీఎన్‌బీ స్పష్టం చేసింది.
గత కొన్ని సంవత్సరాలుగా కోహ్లీ పీఎన్‌బీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా, బ్యాంకులో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా పీఎన్‌బీతో చేసుకున్న ఒప్పందాన్ని విరాట్ కోహ్లీ రద్దు చేసుకోబోతున్నట్లు జాతీయ మీడియాలో వార్త కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో పాటు పీఎన్‌బీ బ్యాంక్‌కు సంబంధించి ఖాతాదారులు కేవలం రూ. మూడు వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోవాలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని అవన్ని అసత్య వార్తలను తెలిపింది. కొత్తగా నగదు విత్‌డ్రాపై ఎలాంటి పరిమితులు విధించలేదని పేర్కొంది.
విరాట్ కోహ్లీ తన పదహారేళ్ల వయస్సున్నప్పటి నుంచి పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఖాతాదారుడు. అంతేగాక అతను 2016 సంవత్సరం నుంచి బ్యాంకుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బ్యాంక్ సమర్ధవంతంగా ఎదుర్కొన కలిగే సత్తా ఉందని, కస్టమర్లు, స్టాక్ హోల్డర్లు తమకు సహకరించాల్సిందిగా ఆ ప్రకటనలో పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications