Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs CSK Toss: జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు: శ్రేయస్ అయ్యర్

PBKS vs CSK: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ పంజాబ్ సొంత మైదానం ఛండీగఢ్ లోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

చెన్నై జట్టు వరుసగా మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. కాబట్టి నేటి మ్యాచ్ వారికి చాలా ముఖ్యమైనది. జట్టును వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని ఫామ్ లో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీని కారణంగా జట్టు సమతుల్యత దెబ్బతింటోంది. మరో వైపు పంజాబ్ జట్టు కూడా తన చివరి మ్యాచ్ లో ఓటమిని చవిచూసింది. కాబట్టి నేటి మ్యాచ్ లో విజయం సాధించి తిరిగి విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది.

Punjab Kings Won Toss and Chose to Bat Against Chennai Super Kings

టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్ కోసం జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని చెప్పాడు తాము ముందుగా బ్యాటింగ్ చేయబోతున్నామని, ఎందుకంటే మా బ్యాటింగ్ ఎలా ఉందో ముందుగా చర్చించామన్నారు. బ్యాటింగ్ లైనప్ ను ఉపయోగించుకోవాలన్నారు. చివరి ఆటలో అంతగా రాణించలేదని.. తిరిగి పుంజుకుని వేగం పెంచాలనుకుంటున్నామని శ్రేయర్ అయ్యర్ అన్నాడు. మా జట్టులో మంచి బౌలర్లు ఉన్నారు కానీ వారి ఎలా ఉపయోగించుకోవాలనేది చాలా ముఖ్యమన్నారు. చివరి ఆటలో బంతి పెద్దగా తిరగలేదని.. రాజస్థాన్ బ్యాటర్లకు కూడా క్రెడిట్ ఇవ్వాలని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు. చెన్నై జట్టు కూడా తన ప్లేయింగ్ 11 లో ఎలాంటి మార్పులు చేయలేదు.

పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ తుది జట్లు ఇవే..
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నేహల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, మార్కో జాన్సన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), విజయ్ శంకర్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరానా

పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్స్: సూర్యాంశ్ షెడ్గే, యశ్ ఠాకూర్, ప్రవీణ్ దూబే, అజ్మతుల్లా ఒమర్జాయ్, వైశాక్ విజయ్‌కుమార్

సీఎస్కే ఇంపాక్ట్ ప్లేయర్స్: శివమ్ దూబే, జామీ ఓవర్టన్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, అన్షుల్ కాంబోజ్

ఇరు జట్ల రికార్డు ఎలా ఉందంటే..
పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 30 మ్యాచ్ లు జరిగాయి. వీటిలో సీఎస్కే 16 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పంజాబ్ 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. చెన్నైకి గట్టి పోటీ ఇచ్చిన కొన్ని జట్లలో పంజాబ్ ఒకటి. 2022 సంవత్సరం నుండి, ఇద్దరి మధ్య 5 మ్యాచ్‌లు జరగగా, అందులో పంజాబ్ 4 మ్యాచ్‌ల్లో గెలిచింది.

Story first published: Tuesday, April 8, 2025, 19:29 [IST]
Other articles published on Apr 8, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+