Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs RR: కెప్టెన్‌గా బరిలోకి సంజు శాంసన్.. తుది జట్లు ఇవే..

PBKS vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ లో భాగంగా అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించే మరో కీలక పోరు కాసేపట్లో జరగనుంది. టోర్నమెంట్ లో 18వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య చండీగఢ్ లోని మహరాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. రెండు జట్లూ మంచి ఫామ్ లో ఉండడంతో ఈ మ్యాచ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే స్టేడియానికి క్రికెట్ ప్రేమికులు భారీ సంఖ్యలో చేరుకుని తమకు ఇష్టమైన జట్లకు మద్దతుగా నినాదాలు చేస్తూ సందడి చేస్తున్నారు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బౌలింగ్ ను ఎంచుకున్నాడు. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్ బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా సంజు శాంసన్ తిరిగి వచ్చాడు. ఇంతకు ముందు మ్యాచ్ లలో సంజు శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టులో ఓ మార్పు జరిగింది. రాజస్థాన్ ప్లేయర్ తుషార్ దేశ్ పాండే స్థానంలో యుధ్వీర్ జట్టులోకి వచ్చాడు.

Punjab Kings Won Toss and Chose Bowling Captain Sanju Samson Returns

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (w), శ్రేయాస్ అయ్యర్ (సి), మార్కస్ స్టోయినిస్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (సి), నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ (w), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహీశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, సందీప్ శర్మ

Story first published: Saturday, April 5, 2025, 19:30 [IST]
Other articles published on Apr 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+