For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PBKS vs RR Dream11 Prediction: డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్! ఫాంటసీ క్రికెట్ చిట్కాలు!!

Punjab Kings vs Rajasthan Royals Dream11 Prediction:Captain, Vice-Captain, Fantasy Tips For Match 32

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశలో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమవుతోంది. దుబాయ్ వేదికగా మంగళవారం పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు టాస్ పడనుండగా.. 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఐపీఎల్ 2021లో ఇరు జట్లు తలపడడం ఇది రెండోసారి.

ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. దాంతో నేటి పోరు ఆసక్తికరంగా ఉండనుంది. ఇక స్టార్ స్పోర్ట్స్ ఛానెల్స్, డిస్ని + హాట్ స్టార్‌లలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. సాయంత్రం 6.30కు స్పోర్ట్స్ ఛానెల్లో లైవ్ ఆరంభం కానుంది.

శాంసన్ సెంచరీ వృధా

శాంసన్ సెంచరీ వృధా

భారత్ వేదికగా జరిగిన మొదటి దశలో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీ‌గా సాగింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కేవలం 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (119) సెంచరీతో రాణించినా ఫలితం లేకుండా పోయింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (91) భారీ ఇన్నింగ్స్ ఆడగా.. దీపక్ హుడా (64), క్రిస్ గేల్ (40) రాణించారు. అనంతరం రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 217 రన్స్ చేసింది. శాంసన్ సెంచరీ వృధా అయింది. ఈరోజు కూడా మరోసారి ఈ రెండు జట్ల మధ్య ఉత్కంఠ పోరు జరిగే అవకాశం ఉంది.

ఫామ్‌లో లూయిస్‌

ఫామ్‌లో లూయిస్‌

తోలి దశలో స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌తో పాటు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, పేసర్ ఆండ్రూ టై సేవలను రాజస్థాన్ రాయల్స్ కోల్పోయింది. రెండో దశలో స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్‌ కూడా దూరమయ్యాడు. అయితే బట్లర్ ప్లేస్‌లో విండీస్ హిట్టర్ ఎలిన్ లూయిస్‌ను జట్టులోకి తీసుకుంది. లూయిస్‌ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. సీపీఎల్ 2021లో వరుస హాఫ్ సెంచరీలతో దూకుడుమీదున్నాడు. రెండో దశకు కొత్తగా జట్టులోకి వచ్చిన గ్లేన్ ఫిలిప్స్, ఒషానే థామస్, తబ్రియాజ్ షంసీలు కూడా సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వీరికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే.

యశస్వీ జైస్వాల్‌లో కలిసి ఎవిన్ లూయిస్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఫస్ట్ డౌన్‌లో సంజూ శాంసన్ రానుండగా.. నాలుగో స్థానంలో లియమ్ లివింగ్ స్టోన్ రానున్నాడు. ఆపై రియాన్ పరాగ్, శివమ్ దూబే, క్రిస్ మోరీస్, రాహుల్ తెవాటియాలు ఆడనున్నారు. పేస్ విభాగంలో కార్తీక్ త్యాగీ, ముస్తాఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియాలకు అవకాశం దక్కనుంది.

గేల్, పూరన్‌ పైనే భారం

గేల్, పూరన్‌ పైనే భారం

పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టులో స్టార్ ఆటగాళ్లకు మాత్రం కొదవ లేదు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, దీపక్ హుడా, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, ఆదిల్ రషీద్, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, క్రిస్ జోర్డాన్‌లతో ఆ జట్టు కళకళలాడుతోంది. అయితే గేల్ ఒకటి రెండు మ్యాచులలో మెరుపులు మెరిపించినా.. పూరన్ నిరాశపరిచాడు.

రాహుల్, మయాంక్ కూడా నిలకడైన ప్రదర్శన చేయాల్సి ఉంది. దీపక్ హుడా, షారుఖ్ ఖాన్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. జోర్డాన్, రషీద్ గాడిలో పడాల్సి ఉంది. రవి బిష్ణోయ్, అర్ష‌దీప్, షమీలు రాణిస్తుండడం పంజాబ్ జట్టుకు కలిసొచ్చే అంశం. హర్‌ప్రీత్ బ్రార్ తుది జట్టులో ఉండే అవకాశముంది.

సగటు స్కోరు 166

సగటు స్కోరు 166

ఆదివారం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన దుబాయ్ స్టేడియంలోనే ఈ రోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఆడనున్నాయి. ఆరంభంలో పేసర్లకు, ఆ తర్వాత స్పిన్నర్లకు దుబాయ్ పిచ్ అనుకూలించనుంది. మైదానం చాలా పెద్దది కాబట్టి భారీ స్కోర్లు నమోదవ్వడం కాస్త కష్టం. అక్కడ ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్ ఉండనుంది. మ్యాచుకు ఎలాంటి వర్ష సూచన లేదు. చేజింగ్ చేసే సమయంలో మంచు ప్రభావం ఉండనుంది. దుబాయ్ వికెట్‌పై మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోరు 166. ఇక్కడ ఛేజింగ్ కష్టమే. రెండోసరి బ్యాటింగ్ చేసిన జట్టు 40 శాతం మాత్రమే విజయాలు అందుకున్నాయి.

డ్రీమ్ 11 టీమ్ టిప్స్

డ్రీమ్ 11 టీమ్ టిప్స్

కెప్టెన్ - లోకేష్ రాహుల్, మయాంక్ అగర్వాల్

వైస్ కెప్టెన్ - క్రిస్ మోరిస్, మహమ్మద్ షమీ

కీపర్లు - లోకేష్ రాహుల్, సంజు శాంసన్

బ్యాట్స్ మెన్ - మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, లియమ్ లివింగ్‌స్టోన్

ఆల్ రౌండర్లు - క్రిస్ మోరిస్, దీపక్ హుడా

బౌలర్లు - ముస్తాఫిజుర్ రహమాన్, చేతన్ సకారియా, హర్‌ప్రీత్ బ్రార్, మహమ్మద్ షమీ.

డ్రీమ్ 11 టీమ్: లోకేష్ రాహుల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, సంజు శాంసన్, క్రిస్ గేల్, లియమ్ లివింగ్‌స్టోన్, దీపక్ హుడా, క్రిస్ మోరిస్ (వైస్ కెప్టెన్), ముస్తాఫిజుర్ రహమాన్, చేతన్ సకారియా, హర్‌ప్రీత్ బ్రార్, మహమ్మద్ షమీ.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్ ( కెప్టెన్, కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, షారుఖ్ ఖాన్, ఫాబియన్ అలెన్/ఆదిల్ రషీద్, రవి బిష్ణోయ్, ఆర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్/హర్‌ప్రీత్ బ్రార్, మహమ్మద్ షమీ.

రాజస్థాన్ రాయల్స్: ఎవిన్ లూయిస్, యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్, కీపర్), లియమ్ లివింగ్‌స్టోన్, శివమ్ దూబే, రియాన్ పరాగ్, క్రిస్ మోరీస్, రాహుల్ తెవాటియా, కార్తీక్ త్యాగి, ముస్తాఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియా.

Story first published: Tuesday, September 21, 2021, 16:27 [IST]
Other articles published on Sep 21, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+