Punjab Kings Playing 11: గేల్ ఇన్.. మార్కర‌మ్ ఔట్.. రాజస్థాన్‌తో బరిలోకి దిగే పంజాబ్ జట్టు ఇదే!

దుబాయ్: భారత్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 ఫస్టాఫ్‌లో నానా తంటాలు పడిన పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్.. నాలుగు నెలల విరామం తర్వాత మరో ఆసక్తికర పోరుకు సిద్దమయ్యాయి. దుబాయ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగే మ్యాచ్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోన్నాయి. ఇప్పటిదికా ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్.. మూడు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో ఏడో స్థానంలో ఉండగా... ఏడు మ్యాచ్‌ల్లో మూడే గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఆరో స్థానంలో కొనసాగుతోంది. దాంతో ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఇరు జట్లు ప్రతీ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. దాంతో ఇరు జట్ల మధ్య జరిగే నేటి పోరు ఆసక్తికరంగా ఉండనుంది. అయితే స్టార్ ఆటగాళ్ల సేవలు కోల్పోయి రాజస్థాన్ చతికిలపడగా.. పంజాబ్ కింగ్స్‌ పటిష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనా సెకండ్ ఫేజ్‌ను ఇరు జట్లు గెలుపుతో స్టార్ట్ చేయాలని భావిస్తుండటంతో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.

 పటిష్టంగా పంజాబ్..

పటిష్టంగా పంజాబ్..

కరోనాతో వచ్చిన బ్రేక్ కారణంగా కొంతమంది ఆటగాళ్లు దూరమైన పంజాబ్ కోర్‌టీమ్‌ దెబ్బతినలేదు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, దీపక్ హుడా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్ వంటి భారత ఆటగాళ్లతో పాటు క్రిస్ గేల్, నికోలస్ పూరన్, ఆదిల్ రషీద్, క్రిస్ జోర్డాన్‌లతో ఆ జట్టు బలంగా ఉంది. ఇక ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించనుండగా.. వెటరన్ క్రిస్ గేల్ ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు. ఆ తర్వాత నికోలస్ పూరన్ నాలుగో స్థానంలో రానుండగా.. దీపక్ హుడా, షారుఖ్ ఖాన్ ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ చేయనున్నారు. స్పెషలిస్ట్ ఆల్‌రౌండర్‌గా క్రిస్ జోర్డాన్ బరిలోకి దిగనుండగా.. స్పిన్నర్ల కోటాలో ఆదిల్ రషీద్, రవి బిష్ణోయ్ చోటు దక్కనుంది. అర్ష‌దీప్ సింగ్‌తో కలిసి మహమ్మద్ షమీ పేస్ బాధ్యతలను మోయనున్నాడు.

 స్టార్లు లేకుండా రాజస్థాన్..

స్టార్లు లేకుండా రాజస్థాన్..

ఇక కరోనా కారణంగా వచ్చిన సుదీర్ఘ బ్రేక్‌ రాజస్థాన్ రాయల్స్‌కు తీవ్ర నష్టం చేకూర్చింది. ఫస్టాఫ్ లీగ్‌లో ఆ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌తో పాటు ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, ఆండ్రూ టై సేవలను కోల్పోయింది. సెకండాఫ్ లీగ్ ఓపెనర్ జోస్ బట్లర్‌ కూడా దూరమయ్యాడు. అయితే బట్లర్ ప్లేస్‌లో సీపీఎల్ స్టార్ ఎలిన్ లూయిస్‌ను ఆ జట్టు తీసుకుంది. అతను ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. కొత్తగా జట్టులోకి వచ్చిన గ్లేన్ ఫిలిప్స్, ఒషానే థామస్, తబ్రియాజ్ షంసీలకు తుది జట్టులో చోటు దక్కడం కష్టమే. యువ ఆటగాడు యశస్వీ జైస్వాల్‌లో కలిసి ఎవిన్ లూయిస్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. ఫస్ట్ డౌన్‌లో కెప్టెన్ సంజూ శాంసన్ రానుండగా.. నాలుగో ప్లేస్‌లో లియమ్ లివింగ్ స్టోన్ బ్యాటింగ్ చేయనున్నాడు. ఆ తర్వాత దేశవాళీ స్టార్లు రియాన్ పరాగ్, శివమ్ దూబే బరిలోకి దిగనుండగా ఆల్‌రౌండర్‌గా క్రిస్ మోరీస్, రాహుల్ తెవాటియా ఆడనున్నారు. పేసర్లుగా కార్తీక్ త్యాగీ, ముస్తాఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియాలకు అవకాశం దక్కనుంది.

పిచ్ రిపోర్ట్:

పిచ్ రిపోర్ట్:

బ్యాటింగ్ చేస్తున్నా కొద్ది పిచ్ నెమ్మదించనుంది. ఆదివారం ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన పరిస్థితులే రిపీట్ అవనున్నాయి. ఆరంభంలో పేసర్లకు ఆ తర్వాత స్పిన్నర్లకు అనుకూలించనుంది. ఓపికగా బ్యాటింగ్ చేస్తే పరుగులు సాధ్యం. అయితే మైదానం చాలా పెద్దది కాబట్టి భారీ స్కోర్లు నమోదవ్వడం కష్టం. ఈ మ్యాచ్‌కు వర్ష సూచనలేదు. కాకపోతే ఉక్కపోత వాతావరణం ఉండనుంది. గరిష్టంగా 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండనుంది. ఉక్కపోత వాతావరణంలో ప్లేయర్లకు ఇబ్బందులు తప్పవు.

మరోసారి హోరాహోరీ తప్పదా?

మరోసారి హోరాహోరీ తప్పదా?

ఇక భారత్ వేదికగా జరిగిన ఫస్టాఫ్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీ‌గా సాగింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూశాంసన్ (119) భారీ సెంచరీతో రాణించినా విజయం దక్కలేదు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 221 రన్స్ చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(91) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. దీపక్ హుడా(64), క్రిస్ గేల్(40) ధాటిగా ఆడారు. అనంతరం రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 217 రన్స్ చేసింది. శాంసన్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మరోసారి ఈ ఇరు జట్లు మధ్య ఉత్కంఠ పోరు తప్పదా? అనిపిస్తోంది.

తుది జట్లు(అంచనా)

తుది జట్లు(అంచనా)

పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్( కెప్టెన్, కీపర్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, షారుఖ్ ఖాన్, ఫాబియన్ అలెన్/ఆదిల్ రషీద్, రవిబిష్ణోయ్, ఆర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, మహమ్మద్ షమీ

రాజస్థాన్ రాయల్స్: ఎవిన్ లూయిస్, యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్, సంజూ శాంసన్(కెప్టెన్, కీపర్), లియమ్ లివింగ్‌స్టోన్, రియాన్ పరాగ్, శివమ్ దూబే, క్రిస్ మోరీస్, రాహుల్ తెవాటియా, కార్తీక్ త్యాగి, ముస్తాఫిజుర్ రెహ్మాన్, చేతన్ సకారియా/జయదేవ్ ఉనాద్కత్

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
Match 23 - October 29 2021, 03:30 PM
వెస్టిండిస్
బంగ్లాదేశ్
Predict Now
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, September 21, 2021, 11:07 [IST]
Other articles published on Sep 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X