Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లివింగ్‌స్టోన్ తుఫాన్ ఇన్నింగ్స్ వల్ల సన్ రైజర్స్ మీద అలవోకగా గెలిచిన పంజాబ్ కింగ్స్

punjab kings

పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ విధించిన 158పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ ఉఫ్ మని ఊదేసింది. పంజాబ్ బ్యాటర్లలో జానీ బెయిర్ స్టో (23పరుగులు 15బంతుల్లో 5ఫోర్లు), శిఖర్ ధావన్ (39పరుగులు 32బంతుల్లో 2ఫోర్లు), లియమ్ లివింగ్ స్టోన్ (49పరుగులు 22బంతుల్లో 2ఫోర్లు 5సిక్సర్లు), జితేష్ శర్మ (19పరుగులు 7బంతుల్లో 3ఫోర్లు 1సిక్సర్) దంచికొట్టడంతో 158పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 15.1ఓవర్లలోనే ఛేదించింది. 5వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుని లీగ్ చివరి మ్యాచ్‌ను గ్రాండ్‌గా ముగించింది. సన్ రైజర్స్ బౌలర్లలో ఫారూఖీ 2వికెట్లు తీసుకోగా..వాషింగ్టన్ సుందర్ 1, జగదీష సుచిత్ 1, ఉమ్రాన్ మాలిక్ 1వికెట్ తీశారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ 3వికెట్లు తీసిన పంజాబ్ బౌలర్ హర్ ప్రీత్ బ్రార్‌కు దక్కింది. ఈ మ్యాచ్ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలోకి చేరుకోగా సన్ రైజర్స్ 8వ స్థానంలోకి వెళ్లింది. ఇక ఈ మ్యాచ్ ముగియడంతో ప్లేఆఫ్స్ పోరు మిగిలి ఉంది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ (43పరుగులు 32బంతుల్లో 5ఫోర్లు 2సిక్సర్లు), రాహుల్ త్రిపాఠి (20 పరుగులు 18బంతుల్లో), అయిడెన్ మార్క్రరమ్ (21), వాషింగ్టన్ సుందర్ (25పరుగులు 19బంతుల్లో 3ఫోర్లు 1సిక్సర్), రోమరియో షెఫార్డ్ (26పరుగులు 15బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సర్లు) తలా ఓ చేయి వేయడంతో సన్ రైజర్స్ నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లు కోల్పియ 157 పరుగులు చేయగలిగింది. ఇక పంజాబ్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3, హర్ ప్రీత్ బార్ 3, రబాడా 1వికెట్ తీసుకున్నారు.

తుది జట్లు
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), షారుఖ్ ఖాన్, జితేష్ శర్మ (w), హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, ప్రేరక్ మన్కడ్, కగిసో రబాడ, అర్ష్‌దీప్ సింగ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ప్రియమ్ గార్గ్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్(w), రొమారియో షెపర్డ్, వాషింగ్టన్ సుందర్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్(కెప్టెన్), ఫజల్హాక్ ఫరూఖీ, ఉమ్రాన్ మాలిక్

Story first published: Sunday, May 22, 2022, 23:26 [IST]
Other articles published on May 22, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+