Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువ క్రికెటర్ల కోసం పూణేలో క్రికెట్ అకాడమీ ప్రారంభం.. అకాడమీ స్థాపనలో భాగస్వామిగా కేదర్ జాదవ్

punit balan-kedar jadhav cricket academy started in pune city.

పునీత్ బాలన్ గ్రూప్ అధినేత పునీత్ బాలన్, టీమిండియా క్రికెటర్ కేదర్ జాదవ్ కలిసి 'పునీత్ బాలన్ - కేదర్ జాదవ్ క్రికెట్ అకాడమీ'ని పూణెలో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పూణే నగరానికి చారిత్రక క్రికెట్ వారసత్వం ఉందని, అందుకే ఇక్కడ క్రికెట్ అకాడమీని ప్రారంభిస్తున్నామని తెలిపారు. పూణే నగరం నుంచి చాలా మంది జాతీయ, అంతర్జాతీయ క్రికెటర్లుగా రాణించారన్నారు. ఈ అకాడమీ ద్వారా పూణేలో ఉన్న యువ ప్రతిభావంతులను వెలికి తీయడం, అలాగే క్రికెట్లో వారి కెరీర్‌ను మెరుగుపరచడం అనే సదుద్దేశాలతో ఈ అకాడమీని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పూణేలో కొత్రూడ్ ప్రాంతంలో ఈ అకాడమీని నిర్వహించనున్నారు. పునీత్ బాలన్ గ్రూప్ ఈ అకాడమీకి తమ పూర్తి సహాయ సహకారాలను అందించనుంది.

పునీత్ బాలన్ గ్రూప్.. ప్రధానంగా క్రికెట్‌ను, క్రికెటర్లను ఎంతగానో ప్రోత్సహిస్తూ వస్తోంది. పూణే క్రికెట్ మైదానంలో ఎన్నో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించింది. అండర్ 12, అండర్ 14, అండర్ 17 బాయ్స్ క్రికెట్ టోర్నీలు నిర్వహించింది. అలాగే కార్పొరేట్ గ్రూప్‌ల మధ్య టీ20 టోర్నమెంట్లు నిర్వహించింది. ఇక తాజాగా క్రికెట్ అకాడమీని నెలకొల్పి.. పూణేలోని యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసే ప్రయత్నానికి ఒడిగట్టింది. క్రికెట్ మాత్రమే కాకుండా.. సైక్లింగ్, షూటింగ్, థైక్వాండో, ఖోఖో, లాన్ టెన్నిస్, బ్యాడ్మింటన్, హ్యాండ్ బాల్ స్పోర్ట్స్ తదితర క్రీడా టోర్నీలను కూడా పునీత్ బాలన్ గ్రూప్ గతంలో నిర్వహించింది.

ఈ అకాడమీ ప్రారంభం సందర్భంగా మహారాష్ట్రకు చెందిన క్రికెటర్ కేదర్ జాదవ్ మాట్లాడుతూ.. తన కెరీర్ పూణేలోనే ప్రారంభించినట్లు తెలిపారు. ఇక్కడే తన ఆట మెరుగైందని, తదనంతరం అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టానని పేర్కొన్నారు. ఈ అకాడమీ ద్వారా చాలా మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పునీత్ బాలన్, కేదర్ జాదవ్ ఇరువురు మాట్లాడుతూ.. అకాడమీ లక్ష్యాలను తెలిపారు. సుశిక్షితులైన కోచ్‌ల ద్వారా నాణ్యమైన శిక్షణ యంగ్ ప్లేయర్లకు అందించడం, ప్రాక్టీస్, ట్రైనింగ్ కావడానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించడం. అలాగే క్రికెట్లో మహిళల ప్రాతినిధ్యం పెంచడం కోసం చర్యలు చేపట్టడం, అలాగే అంధులు, దివ్యాంగులైన వారికి ప్రత్యేక శిక్షణ కల్పించి.. వారిలోని అసామాన్య ప్రతిభను వెలికితీయడం, ఆర్థికంగా వెనకబడ్డ ప్లేయర్లకు వెన్నుదన్నుగా నిలవడం లాంటి తదితర లక్ష్యాలను పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కేదర్ జాదవ్ ట్వీట్ చేస్తూ.. 'పునీత్ బాలన్ - కేదార్ జాదవ్ క్రికెట్ అకాడమీని ఈరోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. క్రీడాకారులకు వారి కలలను నెరవేర్చుకోవడానికి సానుకూల వాతావరణాన్ని, అత్యుత్తమ సౌకర్యాలను ఈ క్రికెట్ అకాడమీ ద్వారా కల్పిస్తాం. అలాగే వివిధ ఫార్మాట్లలో పురుషులు, మహిళ క్రికెటర్లకు అవకాశాలు లభించేలా ప్రయత్నిస్తాం.'అన్నారు.

Story first published: Wednesday, April 20, 2022, 18:29 [IST]
Other articles published on Apr 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+