Pune T20I: కోహ్లీ అరంగేట్రం చేసినప్పటి నుంచీ లంకపై భారత్ రికార్డు విజయం!

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించి కొత్త ఏడాదిని విజయంతో ఘనంగా ఆరంభించింది. సిరిస్‌లో భాగంగా చివరిదైన మూడో టీ20 శుక్రవారం పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది.
ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి కొత్త ఏడాదిలో తమ మొదటి సిరిస్‌ను కైవసం చేసుకోవాలని కోహ్లీసేన ఊవిళ్లూరుతోంది. మూడో టీ20లో గనుక టీమిండియా విజయం సాధిస్తే శ్రీలంకపై తన రికార్డుని కూడా మరింతగా మెరుగుపరచుకుంటుంది.
కోహ్లీ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తర్వాత శ్రీలంకపై ద్వైపాక్షికి సిరిస్‌లో ఇప్పటివరకు టీమిండియా ఓడిపోలేదు. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 6 టీ20ల సిరిస్‌లు జరగ్గా అందులో టీమిండియా 5 సిరిస్ విజయాలను సొంతం చేసుకుంది. ఒక సిరిస్ డ్రాగా ముగిసింది.
టీమిండియా అద్భుతమైన రికార్డు
ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా అద్భుతమైన ఫామ్‍లో ఉంది. ఇప్పటికే కోహ్లీ సేన రెండు టీ20 సిరిస్ విజయాలను సొంతం చేసుకోగా... శ్రీలంక మాత్రం వరుసగా 4 సిరిస్‌ల్లో ఓడిపోయింది. ఈ ఏడాది అక్టోబర్‌లో టీ20 ప్రపంచకప్ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి సిరిస్‌ను టీమిండియా సీరియస్‌గా తీసుకుంటుంది.

మూడో టీ20లో విజయం సాధించి!
ఈ నేపథ్యంలో పూణె వేదికగా శుక్రవారం జరిగే మూడో టీ20లో విజయం సాధించి తొలి సిరిస్‌తో ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించాలని చూస్తోంది. రెండో టీ20లో విజయం సాధించడంతో మూడు టీ20ల సిరిస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. గువహటి వేదికగా జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.

శ్రీలంక సైతం గట్టి పట్టుదలతో
దీంతో చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. సిరీస్‌ను సమం చేయాలంటే ఇందులో తప్పక గెలవాలి. దీంతో మూడో టీ20లో గెలిచి సిరిస్‌ను సమం చేయాలని గట్టి పట్టుదలతో శ్రీలంక ఉంది. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టుపై ప్రతీకారం తీర్చుకుని సిరీస్‌ను సమంతో ముగిస్తుందా లేదా చూడాలి మరి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications