షాపింగ్ మాల్‌లో క్రికెటర్లు: నగరం మొత్తం కలియదిరిగారు
విశాఖపట్నం: రైజింగ్ పూణె సూపర్ జైంట్లీ ఆటగాళ్లు శుక్రవారం నగరంలో సందడి చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం మధ్యాహ్నాం స్పెన్సర్ షాపింగ్‌కు వచ్చారు. ఈ విషయం తెలిసిన మీడియా, ప్రేక్షకులు పూణె ఆటగాళ్లను కలిసేందుకు పెద్ద ఎత్తున ఆటగాళ్లను కలిసేందుకు వచ్చారు.
కోస్తాంధ్రలో 'రోను' తుఫాను కారణంగా రెండు రోజులుగా హొటల్‌కు పరిమితమైన రెండు జట్ల ఆటగాళ్లు నగరంలో తిరిగే పనిలోపడ్డారు. నోవాటెల్‌లో గురువారం జిగిన మీట్ అండ్ గ్రాట్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆటపాటలతో అభిమానులను అలరించిన పూణే ఆటగాళ్లు స్పెన్సర్స్‌లో కొంత సేపు షాపింగ్ చేశారు.
అజ్యెంక రహానే, అశోక్‌దిండే, రవిచంద్ర అశ్విన్, చాహిల్, అపరాజిత్ షాపులోని అన్ని విభాగాలలో కలియతిరిగారు. స్పెన్సర్‌లో బంతిని పట్టుకొని అభిమానులకు ఫొటోలకు ఫోజులిచ్చారు. అంతక ముందు శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామిని క్రికెటర్లు దర్శించుకున్నారు.

షాపింగ్ మాల్‌లో పూణె జట్టు: బంతితో ఫోటోలకు ఫోజులు
టీమిండియా ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్, క్రీడాకారులు అజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్ స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అధికారులు వీరికి ఘన స్వాగతం పలికారు. ఆలయంలోని కప్పస్తంభం ఆలింగనం చేసుకుని బేడామండపం వద్ద క్రికెటర్లు ప్రదక్షిణం చేశారు.

షాపింగ్ మాల్‌లో పూణె జట్టు: బంతితో ఫోటోలకు ఫోజులు
గర్భగుడిలో క్రీడాకారుల పేరిట స్వామికి పూజలు జరిపారు. వీరితో పాటు నగర ఇన్‌ఛార్జి పోలీస్ కమిషనర్ సూర్యప్రకాశరావు, డీసీపీ రాంగోపాల్‌నాయక్ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అధికారులను పండితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఏఈఓ ఆర్వీవీఎస్ ప్రసాద్ క్రికెటర్లకు స్వామి ప్రసాదం అందించారు.

షాపింగ్ మాల్‌లో పూణె జట్టు: బంతితో ఫోటోలకు ఫోజులు
కాగా రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్ల మధ్య శనివారం జరగనున్న మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. వర్షం పడటంతో మైదానం నిండా వేసిన టార్పాలిన్లు తొలగించారు. పిచ్ పరిసర ప్రాంతాల్లో రోలార్‌తో తొక్కుతూ తడిని పీల్చే పనులను సిబ్బంది చేస్తున్నారు. టార్పాలిన్లపై ఉన్న నీటిని కూడా తోడారు.

షాపింగ్ మాల్‌లో పూణె జట్టు: బంతితో ఫోటోలకు ఫోజులు
మైదానంలో భూగర్భ డ్రైయినేజీ వ్యవస్థ పక్కగా ఉండడంతో వర్షపు నీరంతా కింది భాగం నుంచి బయటకు వెళ్లిపోయింది. ఎసిఎ-విడిసిఎ స్టేడియంను పూర్తిగా కవర్లతో కప్పేయడంతో చిరుజల్లులు కురిసినప్పటికీ మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

షాపింగ్ మాల్‌లో పూణె జట్టు: బంతితో ఫోటోలకు ఫోజులు
స్టేడియంలో చక్కని డ్రైనేజీ వ్యవస్థ ఉండటంతో కొంత మేర తడచినా మ్యాచ్‌కు మాత్రం అడ్డంకి ఏర్పడే అవకాశాలు లేవు. పూణె, పంజాబ్ జట్లు రెండు 8 పాయింట్లతో చివరి రెండు స్థానాల్లో నిలవడంతో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచిన మిగతా జట్లపై ఎలాంటి ప్రభావం ఉండదు.

షాపింగ్ మాల్‌లో పూణె జట్టు: బంతితో ఫోటోలకు ఫోజులు
ఇప్పటికే రెండు జట్లు లీగ్ దశలోనే వైదొలగడంతో ఎలాంటి వత్తిడి లేకుండా రెండు జట్లు ఆడే అవకాశం ఉంది. అయితే చివరి స్ధానంలో నిలవడానికి ఏ జట్టు ఆశించదు కాబట్టి పదో స్ధానం కాగా, రెండు జట్లు తలపడే అవకాశం ఉంది. పంజాబ్, పూణే జట్లు 13 మ్యాచ్‌లు ఆడి నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొంది, తొమ్మిది మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూశాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications