
అసలేం జరిగింది?
పుణె వేదికగా బుధవారం మధ్నాహం 1.30గంటలకు భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే ప్రారంభంకావాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అయితే పిచ్ క్యూరేటర్ పాండురంగ్ సాల్‌గావ్కర్ బుకీలతో చేతులు కలిపాడు. పిచ్‌కు సంబంధించిన రిపోర్టు మొత్తాన్ని బుకీల చేతికి అందించాడు.

బుకీలు చెప్పినట్లే పిచ్‌ను
అంతేకాదు బుకీలు చెప్పినట్లే పిచ్‌ను సిద్ధం చేయడం విశేషం. ఇండియా టుడే ఛానెల్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్‌లో ఈ విషయం బుట్టదాఖలైంది. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్లకు పిచ్ అనుకూలించేలా క్యూరేటర్ ఈ పిచ్‌ను తయారు చేసినట్లు స్పష్టంగా తేలింది. దీంతో విషయం తెలుసుకున్న బీసీసీఐ, ఎమ్‌సీఏ ప్రతినిధులు క్యూరేటర్‌ను సస్పెండ్ చేశారు.

మ్యాచ్ జరగడంపై అనుమానాలు
దీంతో ఇప్పుడు మ్యాచ్ జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై బీసీసీఐ ప్రతినిధులు మాట్లాడుతూ పిచ్ క్యూరేటర్ ను సస్పెండ్ చేశామని రెండో వన్డే జరగాలో? లేదో? మ్యాచ్ రిఫరీ నిర్ణయిస్తాడని తెలిపారు. ఈ విషయంపై తాము దర్యాప్తును ప్రారంభించామని, ఎవరైనా తప్పు చేసినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అభయ్ ఆప్టే తెలిపారు.

రిపోర్టర్లను పిచ్ వద్దకు తీసుకెళ్లిన క్యూరేటర్
బీసీసీఐ, ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా రిపోర్టర్లను క్యూరేటర్ పిచ్ వద్దకు తీసుకెళ్లాడు. క్రికెట్ బుకీల రూపంలో వచ్చిన రిపోర్టర్లతో పిచ్ క్యూరేటర్ మాట్లాడుతూ 'ఒకరిద్దరు ఆటగాళ్లు బౌన్సీ పిచ్ కావాలని కోరుతున్నారని, అది జరుగుతుందా?' అని అడగ్గా 'సరే, పిచ్ ను అలాగే మారుస్తా' అంటూ సమాధానమిచ్చాడు. అంతేకాదు పిచ్‌ను బ్యాటింగ్‌కు సహకరించేలా పిచ్‌ను తయారుచేస్తానని 337 నుంచి 340 పరుగుల చేసే అవకాశం ఉందని చెప్పి స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయాడు.


Click it and Unblock the Notifications











