
భారత్-పాక్ మ్యాచ్‌పై
ఈ విషయంపై శుక్రవారం సమావేశమైన బీసీసీఐ పాలకుల కమిటీ రద్దు అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఛైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నడుచుకుంటామని పేర్కొంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌తో మ్యాచ్‌ను భారత్ ఆడకూడదని అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు.

కపిల్ దేవ్ సైతం
తాజాగా ఈ అంశంపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. వచ్చే వరల్డ్‌కప్‌లో పాక్‌తో ఆడాలా? వద్దా? అనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికే వదిలేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. శుక్రవారం పుణేలో జరిగిన ఓ కార్యక్రమంలో కపిల్ దేవ్ మాట్లాడుతూ "పాకిస్తాన్‌తో ఆడటం, ఆడకపోవడం అనేది మనలాంటి వాళ్లు నిర్ణయించే అంశం కాదు" అని అన్నాడు.

కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి
"ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. దీనిపై మన సొంత అభిప్రాయాలు చెప్పకపోవడమే ఉత్తమం. నిర్ణయాన్ని ప్రభుత్వం, సంబంధిత వర్గాలకు వదిలేయాలి. వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రయోజనాల కోసమే కదా... కాబట్టి వాళ్లేం కోరుకుంటారో అదే మనం చేద్దాం" అని కపిల్ పేర్కొన్నాడు.

పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడాలా వద్దా?
మరోవైపు పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడాలా వద్దా అన్న విషయంపై బీసీసీఐ పరిపాలకుల కమిటీ (సీఓఏ) తన నిర్ణయాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఉగ్రవాదానికి అడ్డాగా మారిన దేశాలతో క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలని ఐసీసీకి బీసీసీఐ లేఖ రాసింది.


Click it and Unblock the Notifications













