బీసీసీఐ స్పందన ఇదీ: వరల్డ్‌కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ జరుగుతుందా?


హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌లో దాయాది దేశమైన పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడకూడదంటూ సీసీఐతో పాటు యావత్ జాతి మొత్తం కోరుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా, భారత్-పాక్ మ్యాచ్‌పై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) బుధవారం స్పందించింది.
ఇంగ్లాండ్ వరల్డ్ కప్‌లో భారత ప్రభుత్వం పాకిస్థాన్‌తో ఆడకూడదని నిర్ణయిస్తే దానిని తూచ తప్పకుండా పాటిస్తామని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు భారత ప్రభుత్వం నో చెబితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడబోమని బీసీసీఐ తేల్చి చెప్పింది. వరల్డ్‌కప్ సమయానికి పరిస్థితుల్లో కాస్త మార్పు వస్తుంది. ఐసీసీకి దీనితో ఎలాంటి సంబంధం లేదు. అప్పటికి కూడా భారత ప్రభుత్వం పాకిస్థాన్‌తో మ్యాచ్ వద్దంటే మాకు కూడా మరో మార్గం లేదు.
ఐసీసీని సంప్రదించలేదు
ఈ విషయంలో ఇప్పటివరకు ఐసీసీని సంప్రదించలేదని బీసీసీఐ తెలిపింది. అయితే, పాక్‌తో భారత్ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయం తీసుకుంటే... పాక్ మ్యాచ్ ఆడకుండానే పాయింట్లు పొందుతుందని పేర్కొంది. ఇక, ఫైనల్లో భారత్-పాక్ తలపడాల్సి వస్తే... పాక్ మ్యాచ్ ఆడకుండానే వరల్డ్ కప్ గెలుస్తుందని బీసీసీఐ పేర్కొంది. ఈ విషయంపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని, వరల్డ్‌కప్‌కు కొద్ది రోజుల ముందు దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో జవాన్ల కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడితో దేశమంతా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.

40మందికి పైగా జవాన్లు వీరమరణం
ఈ దాడిలో 40మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడితో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగిలాయి. దీనికి దాయాది దేశం పాకిస్థానే కారణమంటూ ప్రజలంతా ఆందోళనలు చేపట్టారు. ఇప్పటికే పాక్ క్రికెటర్ల ఫోటోలను వివిధ రాష్ట్ర క్రికెట్ సంఘాలు తీసేసిన సంగతి తెలిసిందే.

భారత్-పాక్ మ్యాచ్‌పై ఐసీసీ చీఫ్ ఇలా
మరోవైపు భారత్-పాక్ మ్యాచ్‌పై ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ స్పందించారు. "పుల్వామా ఉగ్రదాడి ఘటనలో బాధితులైన వారికి మా తరఫున కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ప్రస్తుతం ఈ విషయంపై ఐసీసీ సభ్య దేశాలతో కలిసి పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఇప్పటి వరకైతే మ్యాచ్‌ల నిర్వహణలో ఎలాంటి మార్పు లేదు. అన్ని మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి" అని అన్నారు.

జూన్ 16న భారత్-పాక్ మ్యాచ్
"నా దృష్టిలో అన్ని వర్గాల ప్రజలను ఏక తాటిపై తెచ్చే సామర్థ్యం ఒక్క క్రీడలకే ఉంది. కాబట్టి దీనిపై మరింతగా చర్చిస్తాం" అని రిచర్డ్సన్ స్పష్టం చేశారు. వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జూన్ 16న మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications