న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అడిలైడ్ టెస్టులో అసలైన టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన పుజారా (వీడియో)

Pujaras maiden hundred in Australia bails India out of trouble

హైదరాబాద్: నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా అడిలైడ్‌ వేదికగా గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ పుజారా ఇన్నింగ్స్ చూసిన ప్రతి ఒక్కరికీ అసలు సిసలైన టెస్టు బ్యాట్స్‌మన్ అంటే ఇతడే అనిపించేలా ఆడాడు. ఒక ఎండ్‌లో వికెట్లు కోల్పోతున్నా... మొక్కవోని దీక్షతో సెంచరీ సాధించాడు.

పుజారా సెంచరీ: అడిలైడ్ టెస్టులో తొలిరోజు నమోదైన గణాంకాలివేపుజారా సెంచరీ: అడిలైడ్ టెస్టులో తొలిరోజు నమోదైన గణాంకాలివే

భారత టెస్టు క్రికెట్‌కు పుజారా సేవలు అవసరం

భారత టెస్టు క్రికెట్‌కు తన అవసరం ఏంటో మరోసారి తెలిసేలా చేశాడు. తొలిరోజైన గురువారం మొత్తం 85.5 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన పుజారా తనదైన శైలిలోనే ట్రేడ్ మార్క్ ఇన్నింగ్స్ ఆడాడు. టెస్టుల్లో పుజారా మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. హేజిల్‌వుడ్, స్టార్క్, కమ్మిన్స్ లాంటి పేస్ బౌలర్లను పుజారా ఎదుర్కొన్న తీరు అద్భుతం.

అతడి టెస్టు క్రికెట్‌కు సత్తాగా నిలిచిన ఇన్నింగ్స్

ఈ మ్యాచ్‌ పుజారా ఆడిన ఇన్నింగ్స్ అతడి టెస్టు క్రికెట్‌కు సత్తాగా నిలిచిన ఇన్నింగ్స్. కారణం... 380 నిమిషాలు... 182 డాట్ బాల్స్... 30 సింగిల్స్... 22 డబుల్స్... 3 త్రిబుల్స్... 7 ఫోర్స్... 6 సిక్సర్స్... 50 స్ట్రైక్ రేట్ ఇలా ఉంది. కోహ్లీ, రాహుల్, రోహిత్ శర్మ, రహానే, పంత్ లాంటి క్లాస్ బ్యాట్స్‌మన్ విఫలమైతే... పుజారా మాత్రం క్రీజులో పాతుకుపోయాడు.

127 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో భారత్

జట్టు స్కోరు 127 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను పుజారా సెంచరీతో ఆదుకున్నాడు. పుజారా 231 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో పుజారాకు ఇది 16వ సెంచరీ కాగా, ఆస్ట్రేలియాపై మూడోది కావడం విశేషం.

అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్న పుజారా

తాజా సెంచరీతో పుజారా అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అడిలైడ్ టెస్టు సెంచరీతో పుజారా టెస్టుల్లో 5000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 108 ఇన్నింగ్స్‌ల్లో పుజారా ఈ ఘనత సాధించాడు. రాహుల్ ద్రవిడ్ సైతం 108 ఇన్నింగ్స్‌ల్లోనే 5,000 పరుగులు పూర్తి చేయడం విశేషం. పుజారా సెంచరీతో మొదటి రోజు 250 పరుగుల గౌరవ ప్రదమైన స్కోర్ చేయగలిగింది.

Story first published: Thursday, December 6, 2018, 18:30 [IST]
Other articles published on Dec 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X