Pujara's Playing 11 vs Pak : నేటి మ్యాచ్‌లో అవేశ్ ఖాన్ ఉండాల్సిందే.. పుజారా పేర్కొన్న ఇండియా టీం ఇదే

ఆసియా కప్ 2022లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య తొలి మ్యాచ్ ఆదివారం దుబాయ్ వేదికగా జరగనుంది. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భారత్ 10వికెట్ల తేడాతో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ టోర్నీలో భారత్‌పై పాకిస్థాన్‌కు అదే తొలి విజయం. ఇక ఆ ఓటమికి లెక్క సరిచెప్పే అవకాశం ఇండియాకు వచ్చింది. నేడు సాయంత్రం 7.30కు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ప్రస్తుతం భారత జట్టులో ఉన్నవాళ్లు ఒంటి చేత్తో గెలిపించగల స్టార్లే. దుర్భేద్యమైన స్క్వాడ్ ఆసియా కప్ టోర్నీకి ఎంపికైంది. అయితే నేటి మ్యాచ్‌లో తుది ప్లేయింగ్ 11లో ఎవరుంటారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సునీల్ గవాస్కర్, వసీం జాఫర్ తదితర ప్రముఖులు తమ ప్లేయింగ్ 11ను ప్రెడిక్ట్ చేయగా.. తాజాగా భారత నయా వాల్ పుజారా సైతం పాక్‌తో మ్యాచ్‌లో ఇండియా తలపడబోయే ప్లేయింగ్ 11ను అంచనా వేశాడు. పుజారా అంచనాలో ఆసక్తికర విషయమేంటంటే.. ఆవేశం స్టార్ అవేశ్ ఖాన్‌కు తుది జట్టులో చోటు కల్పించాడు.

ముగ్గురు పేసర్లు
ఇకపోతే భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఆసియా కప్ టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే. అలాగే హర్షల్ పటేల్ సైతం గాయం వల్ల దూరమయ్యాడు. దీంతో యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇక పుజారా తన ప్లేయింగ్ XIలో ముగ్గురు పేసర్లు ఉండాల్సిందేనని పేర్కొన్నాడు. భువనేశ్వర్ కుమార్ పేస్ విభాగాన్ని లీడ్ చేయనుండగా.. అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్ అతనికి సపోర్ట్ రోల్‌లో ఉండనున్నారు.

డీకేకు నో ఛాన్స్
ఇకపోతే అందరూ పేర్కొంటున్నట్లే టాపార్డర్లో రోహిత్, రాహుల్, విరాట్ కోహ్లీలను పుజారా తన ప్లేయింగ్ 11లో పేర్కొన్నాడు. మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్‌లను నంబర్ 4, నంబర్ 5 స్థానాల్లో బరిలో దిగే బ్యాటర్లుగా పేర్కొన్నాడు. ఇకపోతే స్పెషలిస్టు ఫినిషర్ అయిన దినేష్ కార్తీక్‌కు మాత్రం తన ప్లేయింగ్ 11లో పుజారా చోటివ్వలేదు. ఇకపోతే ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్రా జడేజాలను పేర్కొన్నాడు. ఇక స్పెషలిస్టు స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్‌ను ఎంచుకున్నాడు.

పుజారా పేర్కొన్న టీమిండియా ప్లేయింగ్ 11 :
1.రోహిత్ శర్మ (కెప్టెన్), 2.కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), 3.విరాట్ కోహ్లీ, 4.సూర్యకుమార్ యాదవ్, 5.రిషబ్ పంత్ (వికెట్ కీపర్), 6.హార్దిక్ పాండ్యా, 7.రవీంద్ర జడేజా, 8.భువనేశ్వర్ కుమార్, 9.అవేష్ ఖాన్, 10.అర్ష్‌దీప్ సింగ్, 11.యుజ్వేంద్ర చాహల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications