
నాటింగ్‌హామ్: లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ చిత్తుగా ఓడటం పట్ల అభిమానులు, మాజీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తొలి టెస్టులో కొద్దిపాటి విజయాన్ని చేజార్చుకున్న టీమిండియా రెండో టెస్టులో అస్సలు గెలుపుపై ఆశలు వదిలేసుకుని ఆడినట్లు అనిపించింది. ఇలా తొలి టెస్టు పరాజయం.. 31 పరుగుల తేడాతో ఓడటం నిరాశపర్చిందని మాజీ క్రికెటర్ మోహిందర్ అమర్‌నాథ్ తెలిపారు. అంతకంటే పేలవంగా రెండో టెస్టులో ఓడటం మరింత నిరాశపర్చిందని ఆయన చెప్పారు.
లార్డ్స్‌లో బ్యాట్స్‌మెన్ సమష్టి వైఫల్యాన్ని జీర్ణం చేసుకోవడం కష్టంగా ఉందన్నారు. లార్డ్స్ టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్ 47 ఓవర్లలో 130 పరుగులకే ముగిసింది. పుజారా 87 బంతులు ఆడి 17 పరుగులు మాత్రమే చేయడం పట్ల అమర్‌నాథ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అతిగా డిఫెన్స్ ఆడటం వల్ల మరో ఎండ్‌లో వికెట్లు పడినప్పుడు.. మిగతా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరుగుతుంది.
స్కోరు బోర్డు మీద పరుగులు చేరకపోతే ఒత్తిడి ఇంకా ఎక్కువ అవుతుందని అమర్‌నాథ్ అభిప్రాయపడ్డారు. స్ట్రైక్ రొటేట్ చేయడం వల్ల ఫలితం ఉంటుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఇప్పటివరకూ జరిగిన రెండు టెస్టుల్లో టీమిండియా తుది కూర్పుపై విశ్లేషణ చేశాడు. కొద్దిపాటి మార్పులను సూచిస్తూ.. రెండో టెస్టులో శిఖర్ ధావన్‌ను పక్కనబెట్టడం సరైందని కాదని తెలిపారు.
రహానే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే బాగుంటుంది. అండర్సన్‌ను ఎదుర్కోవడం కోసం బ్యాట్స్‌మెన్ తమ సహజ శైలిలో ఆడాలని అమర్‌నాథ్ సూచించారు. నాటింగ్‌హామ్ వేదికగా జరగనున్న మూడో టెస్టు శనివారం ఆగష్టు 18న మొదలుకానుంది. ఇప్పటికే కొందరు క్రికెటర్లు గాయాల కారణంగా జట్టుకు దూరం కావడంతో జట్టులో ఎలాంటి మార్పులు చేస్తారా.. అనే ఆసక్తి నెలకొంది.