54 బంతులకు ఒకే ఒక్క రన్: ఇట్స్ స్టాండింగ్ టైమ్

హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆఖరుదైన మూడో టెస్టు మ్యాచ్‌లో పరుగులు చేయడానికి భారత బ్యాట్స్‌మన్ చెమటోడ్చుతున్నారు. ఓపెనర్లు మురళీ విజయ్ 32 బంతుల్లో ఎనిమిది పరుగులు, లోకేష్ రాహుల్ డకౌట్‌లు వెంటనే వెనుదిరగడంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను కెప్టెన్ కోహ్లి, పుజారాలు భుజానికెత్తుకున్నారు.

విజయ్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా తొలి పరుగు చేయడానికి 54 బంతులు తీసుకున్నాడు. లుంగీ ఎంగిడి వేసిన ఓవర్లో బంతిని స్క్వేర్ వైపు నెట్టిన పుజారా తొలి పరుగును నమోదు చేశాడు. క్రీజులోకి వచ్చిన 90 నిమిషాల తర్వాత ఒక్క పరుగు చేసిన పుజారాపై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు.
కాగా, మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో లంచ్ సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 24 పరుగులు, పుజారా 66 బంతుల్లో 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా, ఫిలాండర్లకు చెరో వికెట్ పడగొట్టారు.
టెస్ట్ మ్యాచుల్లో 495 బంతులు ఆడిన రాహుల్ ద్రవిడ్ రికార్డును పూజారా దాటేశాడు. ఏకంగా 525 బంతులు ఆడి తనదైన ముద్రను పదిలం చేసుకున్నాడు. 2001 నుంచి టెస్ట్ గణాంకాల ప్రకారం జయవర్దనె 572 బంతులు ఆడి మొదటి స్థానంలో ఉండగా 525బంతులు ఆడిన పూజారా రెండో స్థానంలో ఉన్నాడు.
Most Balls Faced Off A Bowler In An Innings (Since 2001)
| Batsman | Bowler | Balls | Runs | Score | Year |
| Mahela Jayawardene | Nicky Boje | 221 | 115 | 374 (572) | 2006 |
| Cheteshwar Pujara | Steve O'Keefe | 215 | 65 | 202 (525) | 2017 |
| Jacques Kallis | Ray Price | 189 | 68 | 189* (443) | 2001 |
| Younis Khan | Muttiah Muralitharan | 187 | 111 | 313 (568) | 2009 |
| Stephen Fleming | Muttiah Muralitharan | 185 | 95 | 274* (476) | 2003 |
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications