For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ ర్యాంకులు: కోహ్లీని దాటేసిన పుజారా, స్మిత్ మరో ఘనత

టీమిండియా బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారా తన కెరీర్‌లోనే ది బెస్ట్ ర్యాంకుని అందుకున్నాడు. మంగళవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో పుజారా రెండో స్ధానానికి ఎగబాకాడు.

By Nageshwara Rao
Pujara jumps to 2nd spot, Kohli stays 5th

హైదరాబాద్: టీమిండియా బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారా తన కెరీర్‌లోనే ది బెస్ట్ ర్యాంకుని అందుకున్నాడు. మంగళవారం ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకుల్లో పుజారా రెండో స్ధానానికి ఎగబాకాడు. టెస్టు ర్యాంకుల్లో కెప్టెన్ విరాట్ కోహ్లీని సైతం పుజారా అధిగమించడం విశేషం.

ప్రస్తుతం ఛటేశ్వర్ పుజారా 888 రేటింగ్ పాయింట్లో రెండోస్ధానంలో కొనసాగుతున్నాడు. ఫలితంగా కెరీర్‌ అత్యధిక పాయింట్లను పుజారా నమోదు చేశాడు. కాగా, గతంలో పుజారా రెండు సార్లు రెండో ర్యాంకుని సాధించాడు. ఈ ఏడాది మార్చిలో ఆసీస్‌తో రాంచీలో జరిగిన టెస్టు అనంతరం రెండో ర్యాంకుని సాధించిన పుజారా, ఆ తర్వాత ఆగస్టులో శ్రీలంకతో కొలంబోలో టెస్టు తర్వాత కూడా రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.

పుజారా తర్వాత నాలుగు స్ధానాల్లో ఉన్న ఆటగాళ్లకు కేవలం 11 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో పుజారా 143 పరుగులతో రాణించి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. మరోవైపు ఇదే టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే.

దీంతో కోహ్లీ ఒక్కసారిగా 60 పాయింట్లు సాధించాడు. దీంతో 877 రేటింగ్ పాయింట్లతో కోహ్లీ ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీకి కెప్టెన్‌గా ఇది ఐదో డబుల్ సెంచరీ అన్న విషయం తెలిసిందే. ఇక, ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 941 రేటింగ్‌ పాయింట్లతో నెంబర్ వన్‌ ర్యాంకును నిలుపుకున్నాడు.

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా గబ్బా స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్‌పై 141 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన స్మిత్ ఐదు పాయింట్లను సాధించాడు. తద్వారా టెస్టు చరిత్రలో అత్యధిక రేటింగ్‌ పాయింట్లు సాధించిన వారిలో ఐదో స్థానంలో ఉన్న పీటర్‌ మే (941) రికార్డుని స్మిత్ సమం చేశాడు.

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ (961) అందరి కన్నా అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌, న్యూజిలాండ్‌ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. డేవిడ్‌ వార్నర్‌ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, లంకపై సెంచరీలు చేసిన మురళీ విజయ్‌, రోహిత్‌ 28, 46 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు.

కేఎల్‌ రాహుల్‌ 9, అజింక్య రహానె 15, శిఖర్‌ ధావన్‌ 29 స్థానాల్లో ఉన్నారు. మరోవైపు బౌలర‍్ల ర్యాంకింగ్స్‌లో భారత ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా రెండో స్థానానికి ఎగబాకాడు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఐదు వికెట్లు సాధించిన జడేజా రెండో స్థానాన్ని దక్కించుకోగా, రవిచంద్రన్‌ అశ్విన్‌ నాలుగో స్థానంలో ఉన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, November 28, 2017, 15:07 [IST]
Other articles published on Nov 28, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+