Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ర‌హానే, పుజారాకు 2022లోనైనా క‌లిసొచ్చేనా?.. చావో రేవోగా సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌

pujara and rahane worst form in 2020, 2021.. They Expectations On 2022

టీమిండియా వెట‌ర‌న్ టెస్ట్ ప్లేయ‌ర్లు అజింక్యా ర‌హానే, చ‌టేశ్వ‌ర్ పుజారాను క‌ష్టాలు వెంటాడుతున్నాయి. ఎంతో కాలంగా భార‌త జ‌ట్టులో ఉన్న ఈ ఇద్ద‌రు సీనియ‌ర్ ఆట‌గాళ్లు కొంత కాలంగా ప‌రుగులు చేయ‌డంలో తీవ్రంగా ఇబ్బంది ప‌డుతున్నారు. ఒక‌ప్పుడు జట్టులో మ్యాచ్ విన్న‌ర్లుగా ఉన్న వీరిద్ద‌రు ఇప్పుడు జ‌ట్టుకే భారంగా మారారు. గ‌త రెండేళ్లుగా ఫేలవ ఆట‌తీరుతో నిరాశ ప‌రుస్తున్నారు. అజింక్య ర‌హానే అయితే త‌న ఫేలవ ఆట కార‌ణంగా ఏకంగా త‌న వైస్ కెప్టెన్సీ ప‌దవినే పోగొట్టుకున్నాడు.

అత్యంత ఫేల‌వంగా ర‌హానే ఆట తీరు

అత్యంత ఫేల‌వంగా ర‌హానే ఆట తీరు

టీమిండియాలో అత్యంత కీల‌క ఆటగాడు. టీమ్‌కు వైస్ కెప్టెన్. విదేశాల్లో స్థిరంగా రాణించే టీమిండియా మ్యాచ్ విన్న‌ర్. కీల‌క స‌మ‌యాల్లో రాణించే ప్లేయ‌ర్, జ‌ట్టులో ఏ స్థానంలోనైనా రాణించ‌గ‌లడు, అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టుగా ధాటిగా కూడా ప‌రుగులు రాబ‌ట్టగ‌ల‌డు. ఈ వ్యాఖ్య‌ల‌న్నీ అజింక్యా ర‌హానేకే సొంతం. కానీ ప్ర‌స్తుతం ఇదంతా గ‌తమైపోయింది. ప్ర‌స్తుతం అలాంటి ప‌రిస్థితి లేదు. ర‌హానే అలాంటి ఇన్నింగ్ ఆడి చాలా కాల‌మే అవుతుంది. ముఖ్యంగా గ‌త రెండేళ్లుగా ర‌హానే తీవ్రంగా నిరాశ ప‌రుస్తున్నాడు. 2020లో 4 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ర‌హానే 8 ఇన్నింగ్స్‌ల్లో కేవ‌లం 38 స‌గ‌టుతో 272 ప‌రుగులు చేశాడు.

ఒక సారి సెంచ‌రీ చేసి అత్య‌ధికంగా 112 ప‌రుగులు చేశాడు. ఒక్క హాఫ్ సెంచ‌రీ కూడా చేయ‌లేదు. ఇక 2021లో 13 టెస్ట్ మ్యాచ్‌లాడి 23 ఇన్నింగ్స్‌ల్లో కేవ‌లం 20 స‌గ‌టుతో 479 ప‌రుగులు చేశాడు. ఇందులో 2 సార్లు మాత్ర‌మే హాఫ్ సెంచ‌రీ మార్క్ అందుకోని అత్య‌ధికంగా 67 ప‌రుగులు చేశాడు. ఈ ఫేల‌వ ఫామ్ కార‌ణంగా వైస్ కెప్టెన్సీ ప‌ద‌విని కూడా కోల్పోయాడు. ర‌హానే ఫేల‌వ ఫామ్ కార‌ణంగా అత‌ని వ్య‌క్తిగ‌త స‌గ‌టు కూడా 39కి దిగ‌జారింది.

దీంతో 2020, 2021 సంవత్స‌రాలు ర‌హానే కెరీర్‌లో పీడ క‌ల‌గా మారిపోయాయి. అంతే కాకుండా ర‌హానే జ‌ట్టులో చోటు నిలుపుకోవాలంటే ప్ర‌స్తుత సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో కనీసం రెండైనా భారీ ఇన్నింగ్స్‌లు ఆడాల్సిందే.

తీవ్రంగా నిరాశ ప‌రుస్తున్న పుజారా

తీవ్రంగా నిరాశ ప‌రుస్తున్న పుజారా

టీమిండియాలో మిస్ట‌ర్ డిఫెండ‌బుల్‌, రాహుల్ ద్రావిడ్ వార‌సుడు, ఎలాంటి ప‌రిస్థితుల్లోనైనా వికెట్ల‌కు అడ్డు గోడ క‌ట్ట‌గ‌ల‌డు, కీల‌క ఆట‌గాడు, భారీ ఇన్నింగ్స్‌లు ఆడ‌గ‌ల‌డు, రోజుల త‌ర‌బ‌డి బ్యాటింగ్ చేయ‌గ‌ల‌డు. కానీ ఇవ‌న్నీ ప్ర‌స్తుతం పుజారా గురించి గ‌తంగానే మారిపోయాయి. పుజారా నుంచి అటువంటి ఇన్నింగ్స్ వ‌చ్చి రెండేళ్లు అవుతుంది.

2020లో 4 టెస్టు మ్యాచ్‌లు ఆడిన పుజారా 8 ఇన్నింగ్స్‌ల్లో 20 స‌గ‌టుతో 163 ప‌రుగులు చేశాడు. ఒక సారి మాత్ర‌మే హాఫ్ సెంచ‌రీ చేశాడు. అత్య‌ధిక స్కోర్ 54 ప‌రుగులు. ఇక 2021లో 14 టెస్ట్ మ్యాచ్‌ల్లో 26 ఇన్నింగ్స్‌లు ఆడి కేవ‌లం 28 స‌గటుతో 702 ప‌రుగులు చేశాడు. 6 హాఫ్ సెంచ‌రీలు చేసి అత్య‌ధికంగా 91 ప‌రుగులు చేశాడు. పుజారా సెంచ‌రీ మార్క్ అందుకోని రెండేళ్లు అవుతుంది. ప్ర‌స్తుత సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో రాణించ‌కుంటే పుజారాపై వేటు త‌ప్ప‌క‌పోవ‌చ్చు.

2022 క‌లిసొచ్చేనా?

2022 క‌లిసొచ్చేనా?

2020, 2021 సంవ‌త్స‌రాలు పుజారా, ర‌హానే కెరీర్‌లో చేదు జ్ఞాప‌కాల‌నే మిగిల్చ‌డంతో వారు 2022లోనైనా రాణించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. అంతేకాకుండా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో టీంలో స్థానం నిలుపుకోవాంటే సౌతాఫ్రికాతో జ‌ర‌గ‌నున్న మిగ‌తా రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో వీరిద్ద‌రు క‌చ్చితంగా రాణించాల్సిందే. ఇప్ప‌టికే ముగిసిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో ష‌రా మాములుగానే ఇద్ద‌రూ విఫ‌ల‌మ‌య్యారు. దీంతో ప్ర‌స్తుతం సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌ కెరీర్ ప‌రంగా పుజారా, ర‌హానేకు చావో రేవో అన్న‌ట్టుగా ఉంది.

Story first published: Saturday, January 1, 2022, 13:52 [IST]
Other articles published on Jan 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+